Asianet News TeluguAsianet News Telugu

Woman Suicide: కొడుకు పుట్ట‌లేద‌ని భర్త వేధింపులు.. అమెరికాలో భారతీయ మహిళ ఆత్మహత్య.. సూసైడ్ వీడియో వైర‌ల్

Indian Woman Suicide in US ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధించడంతో అమెరికాలోని న్యూయార్క్‌లో భారతీయ సంతతి చెందిన ఓ మహిళ  ఆత్మహత్య చేసుకుంది. త‌న మృతికి గృహ హింసే కారణమని ఆవేద‌న వ్యక్తం చేస్తూ.. ఓ వీడియోను పోస్టు చేసింది. 

Indian Woman Suicide in US Sparks Anger, Questions
Author
Hyderabad, First Published Aug 6, 2022, 7:18 PM IST

Indian Woman Suicide in US: మ‌గ సంతానం పుట్ట‌లేద‌ని ఆడ‌వారిని బాధ్యుల్ని చేసి..  వేధింపుల‌కు గురి చేసిన ఘ‌ట‌న అమెరికాలోని న్యూయార్క్‌లో వెలుగులోకి వ‌చ్చాయి. భార్త, అత్త వారి వేధింపులు భ‌రించ‌లేక భార‌త సంత‌తికి మహిళ  ఆత్మహత్య చేసుకుంది. 
 
వివరాల్లోకెళ్తే..  ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ అనే పంజాబీ మహిళకు, అమెరికాలో ఉంటున్న భార‌త సంప‌తికి చెందిన‌ రంజోధ్‌బీర్ సింగ్ తో 2015లో వివాహం జరిగింది. ఇద్దరూ  కుటుంబంతో క‌లిసి అమెరికాలోని న్యూయార్క్‌లోనే నివ‌సిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో ఆమె భర్త, అతడి కుటుంబం ఆమెను మాన‌సికంగా, శారీర‌కంగా తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు భరించలేక అక్కడే మన్‌దీప్ కౌర్ ఆత్మహత్యకు పాల్పడింది. 

మన్‌దీప్ కౌర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడే ముందు తన బాధను చెప్పుకుంటూ, ఏడుస్తూ.. ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో గత 8 ఏళ్లుగా తన భర్త వేధింపులను ఎలా ఎదుర్కొంటుందో కౌర్ స్వయంగా చెప్పింది. ఆ వీడియోలో తన శరీరంపై గుర్తులు, రక్తం గడ్డకట్టడం, చాలా చోట్ల గాయాలను చూపించింది. వేధింపుల‌కు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వివరించింది.

ఆ వీడియోలో మహిళ ఏడుస్తూ.. 'నా భర్త బాగుపడతాడని భావించి ఇన్ని రోజులు వేచి చూసాను. కానీ  8 ఏళ్లుగా.. ప్రయత్నం చేసాను. ఆయ‌న దెబ్బ‌లు రోజూ తట్టుకోలేపోతున్నాను. నాన్న, నేను చనిపోతాను. దయచేసి నన్ను క్షమించండి' అని కోరింది. " గత‌ 8 సంవత్సరాలుగా నిత్యం న‌ర‌క‌మే.. ప్రతిరోజూ నా భార్త ఇష్టం వ‌చ్చిన‌ట్టు.. విచ‌క్షణ రహితంగా.. దాడి చేసేవాడు. ఆయ‌న దెబ్బ‌ల‌ను చాలా కాలం నుండి సహిస్తున్నాను. ఏదో ఒక రోజు అంతా సెట్ అవుతుందని భావించాను. కానీ అలా జరగలేదు. రోజురోజుకు ఆయ‌న టార్చ‌ర్ ఎక్కువ అవుతుంది. గ‌త‌ 8 సంవత్సరాలు నన్ను రోజూ కొట్టేతునే ఉన్నారు. నాకు మ‌గ సంతానం క‌ల‌గ‌లేద‌ని,, అతడు.. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. పెళ్లయిన రెండో సంవ‌త్స‌రం నుంచి.. ప్ర‌తి రోజు నా జీవితం నరకమే. అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 

ప్ర‌తి రోజు అతను తాగి వ‌చ్చి నన్ను కొట్టేవాడు. కొన్నిసార్లు మ‌ద్యం తాగాల‌ని కూడా న‌న్ను బ‌ల‌వంతం చేసేవాడు. విచ‌క్ష‌ణర‌హితంగా ప్రవర్తించేవాడు. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకునేవాడు. నాకు కొడుకులు పుట్టాలేద‌ని.. ప్ర‌తి రోజు వేధించేవాడు.  ఈ విష‌యం తెలిసి మా నాన్న తనపై కేసు పెట్టాడు. ఆ స‌మ‌యంలో అతను నన్ను రక్షించమని వేడుకున్నాడు. దీంతో అత‌నిపై పెట్టిన‌ కేసులు విత్ డ్రా చేసుకోవాల‌ని మా నాన్న‌కు చెప్పాను. అలా అయినా.. అత‌డిని సరి చేయాలని ప్రయత్నించాను. కానీ, మా అత్తయ్య నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు. దేవుడు అందరికీ గుణపాఠం నేర్పాడు. నేనేమీ మాట్లాడను. వాళ్ళకి శిక్ష వేస్తాడు. నేను ఎక్కడికీ వదిలిపెట్టలేదు. నేను నా పిల్లలను వదిలి వెళ్ళిపోతున్నా."అని కౌర్ ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు వీడియో చేసింది. 

రంజోధ్‌బీర్ సింగ్ భార్యను దారుణంగా కొడుతున్న వీడియోలు మరికొన్ని ఉన్నాయి. కొన్ని వీడియోల్లో తల్లిని కొట్ట‌వ‌ద్ద‌ని ఆమె పిల్లలు తండ్రికి వేడుకోవ‌డం చూడ‌వ‌చ్చు. ప్రస్తుతం మన్‌దీప్ కౌర్ వీడియో అక్కడి సోషల్ మీడియాలో ప్ర‌వాస‌ భారతీయులు స్పందించారు.  ముఖ్యంగా అమెరికాలోని పంజాబీల హక్కుల కోసం పోరాడే ‘ద కౌర్ మూమెంట్’ సంస్థ దీనిపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్ పోలీసులు ఈ ఘ‌ట‌న‌ను ఆత్మహత్యగా కాకుండా హత్యగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో విచారణ కొన‌సాగుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios