కెనడాలో భారత వీసా సర్వీసులు నిలిపివేత...
కెనడాలో భారత వీసా సర్వీసులు నిలిపివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాల వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది.

ఢిల్లీ : కెనడా, భారత్ ల మధ్య కొద్ది కాలంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో భారత వీసా సర్వీసులు నిలిపివేసింది. కెనడాకు వెళ్లే పౌరులకు భారత్ వీసా నిలిపేసింది. మళ్లీ ఆదేశాలు ఇచ్చేవరకు వీసాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఖలిస్థాన్ అనుకూల సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో న్యూఢిల్లీకి సంబంధం ఉన్నట్లు ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉందని ఆరోపణలపై అంతర్జాతీయంగా భారీ వివాదం మధ్య కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారతదేశం "తదుపరి నోటీసు వరకు" నిలిపివేసింది. ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ సెంటర్ అయిన బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ నోటీసులో "కార్యాచరణ కారణాల వల్ల" వీసా సేవలు నిలిపివేయబడ్డాయని తెలిపింది.
కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హత్య తో కెనడా, భారత్ ల మధ్య ఉద్రికత్తలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కెనడాలో మరో గ్యాంగ్ స్టర్ సుఖ్ దూల్ హత్యకు గురయ్యాడు. సుఖ్ దూల్ పై భారత్ లో 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కెనడాలో గ్యాంగ్ స్టర్ ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో ఈ హత్యలు జరుగుతున్నాయంటున్నారు.