కరోనాని చంపే మాస్క్ లు అందుబాటులోకి.. ధర ఎంతంటే..

కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫేస్ కి మాస్క్ లు ధరిస్తున్న సంగతి తెలిసిందే. మూతి, ముక్కు.. మొత్తం కవర్ చేసుకునేలా మాస్క్ లు ధరిస్తూ వస్తున్నాం. అయితే.. తాజాగా.. కరోనా వైరస్ ని చంపేసే మాస్క్ లను తయారు  చేశారు.  

ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ రూపొందించిన ఫేస్ మాస్క్... నోరు, ముక్కు ద్వారా వైర‌స్ శరీరంలోకి ప్ర‌వేశించ‌కుండా చూడ‌టమే కాకుండా, వైరస్‌ను కూడా అంతం చేస్తుంది. ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ నానోటెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ కిల్లర్ మాస్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ మాస్క్‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే దీనిని వాష్ చేసుకుంటూ 60 నుంచి 150 సార్లు వ‌రకూ ఉపయోగించుకోవ‌చ్చ‌ని సంస్థ తెలిపింది. 

ముంబైకి చెందిన స్టార్టప్ థర్మ్‌సెన్స్ త‌యారుచేసిన ఈ మాస్క్‌ కరోనా వైరస్ శరీరంలోకి ప్ర‌వేశించ‌కుండా నిరోధించడమే కాకుండా, మాస్క్ బయటి పొరకు వైరస్ అంటుకునేలా చేసి, దానిని చంపేస్తుంది. ఈ మాస్క్  భారతీయ ప్రయోగశాలలతో పాటు అమెరికన్ ల్యాబ్‌ల నుంచి కూడా ఆమోదం పొందింది. అదేవిధంగా ఈ మాస్క్‌కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫైడ్ చేసింది. 

అలాగే ఈ మాస్కుల త‌యారీకి, వాడకానికి కూడా అనుమ‌తి ల‌భ్య‌మ‌య్యింది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం త్వ‌ర‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చే ఈ మాస్క్ ధ‌ర రూ. 300 నుంచి 500 రూపాయల మధ్య ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.