Asianet News TeluguAsianet News Telugu

ఒకడుగు ముందుండాలి: క్రిఫ్టో కరెన్సీపై రాజీవ్ చంద్రశేఖర్

క్రిఫ్ట ో కరెన్సీపై బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ తన అభిప్రాయాలను చెప్పారు. ఈ విషయమై ఆయన బిట్ కాయిన్ వ్యవస్థాపక సభ్యుడితో చర్చించారు. 

Indian Politician Rajeev Chandrasekhar on Indias View of Crypto and Why Theyre Beating the U.S
Author
New Delhi, First Published Sep 11, 2019, 4:49 PM IST

న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ(క్రిఫ్టో కరెన్సీ)పై  భారత దేశం ఓ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తాను ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

బిట్ కాయిన్ వ్యవస్థాపక సభ్యుడు చార్లీ ష్రెమ్‌ బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ చర్చించారు. బిట్ కాయిన్‌ను ఆర్‌బీఐ నిషేధించింది.   శాంతిభద్రతలు,  టెర్రరిజం, సైబర్ మోసాలు ప్రతి నిత్యం చూస్తూనే ఉన్నాం , వీటిని దృష్టిలో ఉంచుకొని క్రిఫ్టో కరెన్సీని దేశంలో నిషేధించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

బిట్ కాయిన్ లేదా క్రిఫ్టో కరెన్సీనిని  మోసాలకు వాడేందుకు ప్రయత్నించే వారి కంటే ఒకడుగు ప్రభుత్వాలు ముందుండాలి. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుండాలంటే ప్రభుత్వాలు  చాలా కష్టపడాల్సి ఉంటుంది. టెక్నాలజీ పరంగా హ్యాకర్ల కంటే వేగంగా పనిచేసే స్థాయికి ప్రభుత్వాలు ఎదగలేదు.దీదీంతోనే క్రిఫ్టో కరెన్సీని ఇండియాలో నిషేధించారు.

ఈ రకమైన చర్యల వల్ల  కొత్త కొత్త ఆవిష్కరణలకు బ్రేకులు వేసినట్టు అవుతోంది. ఈ కొత్త ఆవిష్కర్తలు ఆయా ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని  అభిప్రాయపడ్డారు.అన్ని ప్రభుత్వాలకు కూడ ప్రైవసీ విషయంలో  ఒకింత అనుమానాలు ఉండడం సహజం.

ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అనుకొంటే భద్రతా అధికారులు, ఈ ఆవిష్కర్తలతో సమావేశమై చర్చించి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన, చట్టబద్దమైన ఒక అంగీకారానికి వస్తే నూతన ఆవిష్కరణలు మరింత పెరుగుతాయి.

ప్రస్తుత  ప్రభుత్వం ఇటువంటి ఆవిష్కరణలకు ప్రోత్సాహన్ని అందిస్తుందే తప్ప అడ్డు చెప్పదు. ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకొంటూ నూతన ఆవిష్కర్తలంతా  వచ్చి తమ అభిప్రాయాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచితే  పలు రకాల ప్రశ్నలు, అభిప్రాయాలు,  సూచనలు, సలహాలు వస్తాయి.

ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు ఆ సమస్యలను  ఎలా పరిష్కరిస్తారో వివరిస్తే ఇటువంటి ఆవిష్కరణలను ప్రభుత్వం వ్యతిరేకించే ఆస్కారం ఉండదు.  ప్రజా ప్రతినిధులతో మాట్లాడి  ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తమ ఆలోచన విధానాలను తీసుకెళ్తే లాభం ఉంటుందని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

టెక్నాలజీ, ఇన్నోవేషన్ తన డిఎన్ఏలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై క్రిఫ్టో కరెన్సీ  కంపెనీలతో మాట్లాడేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఆయన  ప్రకటించారు.నెట్ న్యూట్రాలిటి విషయంలో కూడ తాను ఇలానే ఉద్యమించానని ఆయన చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios