Asianet News TeluguAsianet News Telugu

Indian Passport: ఇండియ‌న్ పాస్‌పోర్ట్ హోల్డ‌ర్ల‌కు గుడ్ న్యూస్.. వీసా లేకుండా 59 దేశాలకు వెళ్లొచ్చు

Indian Passport:  భారత పౌరుడు అనే గుర్తింపునకు ప్రపంచ దేశాల్లో బ్రాండ్ వాల్యూ పెరిగిందిప్పుడు. 2021తో పోలిస్తే తాజా త్రైమాసికంలో ఇండియన పాస్‌పోర్ట్ సామర్ధ్యం మరింత మెరుగైంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో గత ఏడాది ర్యాంకింగ్స్‌లో 90వ స్ధానం నుంచి భారత్ ఏకంగా ఏడు స్ధానాలు ఎగబాకి 83వ ర్యాంక్‌ను సాధించింది. 

Indian passport gets stronger  59 countries offer visa-free access
Author
Hyderabad, First Published Jan 14, 2022, 7:06 PM IST

Indian Passport:  భారత పాస్‌పోర్ట్ బ్రాండ్ వాల్యూ పెరిగిందిప్పుడు. గ‌తేడాదితో పోల్చితే.. పాస్ పోర్టు ర్యాంకింగ్ మెరుగుప‌డింది. తాజాగా విడుద‌లైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్ర‌కారం.. భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 90 నుంచి  ఏడు స్థానాలు ఎగబాకి ఇప్పుడు 83వ స్థానానికి చేరింది. దీంతో భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా  దాదాపు 60 దేశాల్లో వీసా లేకుండానే ప్ర‌యాణించ‌వ‌చ్చు.  

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ లో ఎంత మెరుగైన స్థానం పొందితే.. అంతా శ‌క్తివంత‌మైన పాస్ పోర్టుగా గుర్తిస్తారు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇండెక్స్ లో ప్రపంచంలోని మొత్తం 199 దేశాల ర్యాంకింగ్‌ను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో జపాన్, సింగపూర్ పాస్‌పోర్ట్‌లు ప్ర‌ధమ స్థానంలో నిలిచాయి.  ఈ రెండు దేశాల పాస్‌పోర్టులు గ‌ల‌వారు.. ప్రపంచం లోని 192 దేశాలలో వీసా లేకుండా ప్ర‌యాణించ‌వ‌చ్చు.  జర్మనీ, దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులు గ‌ల‌వారు 190 దేశాల్లో వీసా లేకుండా ప్ర‌యాణించవ‌చ్చు.  గ‌తేడాది భార‌త్ పాస్‌పోర్ట్ ర్యాకింగ్ 90 గా ఉండేది. అప్పుడూ మొత్తం 58 దేశాల్లో వీసా లేకుండా ప్ర‌యాణించే వీలు ఉండేది. ప్ర‌స్తుతం ఆ ర్యాంక్ మెరుగుప‌డ‌టంతో దాదాపు 60 దేశాల్లో వీసా లేకుండా ప్ర‌యాణించవ‌చ్చు. 

వీసా లేకుండా ప్ర‌యాణించే దేశాలివే..

ఓషియానియా, కుక్ దీవులు, ఫిజీ, మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నియు, పలావు దీవులు, సమోవా, తువాలు, వనాటు, మిడిల్ ఈస్ట్, ఇరాన్, జోర్డాన్, ఒమన్, ఖతార్, యూరోప్, అల్బేనియా, సెర్బియా, కరీబియన్, బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్, నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్,  గ్రెనడైన్స్, ట్రినిడాడ్,  టొబాగో, 

ఆసియా దేశాలు .. భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావో (SAR చైనా), మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, తైమూర్-లెస్టే దేశాలు.

అలాగే.. అమెరికా, బొలీవియా, ఎల్ సల్వడార్, అలాగే..ఆఫ్రికా దేశాలైన బోట్స్వానా, కేప్ వెర్డే దీవులు, కొమోర్స్ దీవులు, ఇథియోపియా, గాబోన్, గినియా-బిస్సావు, మడగాస్కర్, మౌరిటానియా, మారిషస్, మొజాంబిక్, రువాండా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, టాంజానియా,  ట్యునీషియా, ఉగాండా, జింబాబ్వే వీసా లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆయా దేశాల ప‌రిమితుల‌ను బ‌ట్టి.. 30 రోజుల నుంచి దాదాపు 6 నెల‌ల పాటు ఆ దేశాల్లో ఉండ‌వ‌చ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios