Asianet News TeluguAsianet News Telugu

మరో మిస్సైల్ ప్రయోగం చేసిన ఇండియా: నౌకా విధ్వంసక క్షిపణి టెస్ట్ సక్సెస్

భారత్ మరో క్షిపణిని ప్రయోగించింది. బంగాళాఖాతంలో యుద్దనౌక కోర నుండి ఇండియన్ నేవీ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.ఈ విషయాన్ని ఇండియన్ నేవీ శుక్రవారం నాడు ప్రకటించింది.
 

Indian Navys Anti-ship AShm Missile Test-fired Hits And Sinks Target Ship lns
Author
New Delhi, First Published Oct 30, 2020, 4:35 PM IST

న్యూఢిల్లీ: భారత్ మరో క్షిపణిని ప్రయోగించింది. బంగాళాఖాతంలో యుద్దనౌక కోర నుండి ఇండియన్ నేవీ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.ఈ విషయాన్ని ఇండియన్ నేవీ శుక్రవారం నాడు ప్రకటించింది.

నిర్ధేశిత లక్ష్యాన్ని యాంటి షిప్ మిస్సైల్ (ఎఎస్‌హెచ్ఎం) పరీక్షించింది. నిర్ధేశిత లక్ష్యాన్ని మిస్సైల్ చేధించిన ఫోటోలను నేవీ విడుదల చేసింది.క్షిపణి ఢీకొనడంతో నిర్ధేశిత లక్ష్యంగా ఉన్న నౌక పేలిపోయింది. 

గత కొన్ని రోజుల క్రితం కూడ ఇండియన్ నేవీ క్షిపణిని ప్రయోగించింది.యాంటీ క్షిపణి నిర్ధేశిత లక్ష్యాన్ని చేధించింది..ఐఎన్ఎస్ ప్రభల్ నుండి ఈ ప్రయోగాన్ని చేసినట్టుగా నేవీ ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్: వీడియో విడుదల చేసిన నేవీ

భారత్ చైనా దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వరుసగా ఇండియా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది.దేశీయంగా సమర్ధవంతంగా క్షిపణుల తయారీపై ఇండియా కేంద్రీకరించింది. 

 

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, శౌర్య సూపర్ సోనిక్ క్షిపణి, పృథ్వీ 2 , రుద్రం 1 క్షిపణులను కూడ భారత్ పరీక్షించిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios