భారత నౌకాదళం ఆదివారం అరేబియా సముద్రంలో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు నేవీ అధికారులు సమాచారం ఇచ్చారు. బ్రహ్మోస్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించింది.
భారత నావికాదళం చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. భారత నావికాదళం ఆదివారం నాడు అరేబియా సముద్రంలో బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. అరేబియా సముద్రంలో కచ్చితమైన దాడిని విజయవంతంగా నిర్వహించిందని నేవీ అధికారులు తెలిపారు.
బ్రహ్మోస్ క్షిపణిని కోల్‌కతా-క్లాస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నుండి పరీక్షించారు. బంగాళాఖాతంలోని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది.బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణిలో స్వదేశీ కంటెంట్‌ను పెంచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఇండియన్ నేవీ ప్రకటించింది.
సరిహద్దులో పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ భారత్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణిని డీఆర్డీఏ (స్వదేశీ) పరిజ్ఞానంతో రూపొందించింది. క్షిపణుల్లో స్వదేశీ తయారీ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ నిరంతరాయంగా కృషి చేస్తున్నదని ఇండియన్ నేవీ అధికారులు పేర్కొన్నారు.
ప్రత్యేకతలు
>> భారత్, రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, సబ్‌మెరైన్‌లు, నౌకలు, విమానం లేదా భూమి నుండి ప్రయోగించగల సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది.
>> బ్రహ్మోస్ అనే పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర మరియు రష్యాలోని ముస్క్వా అనే రెండు నదుల పేర్ల నుండి వచ్చింది.
>> యాంటీ షిప్ వెర్షన్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని గతేడాది ఏప్రిల్‌లో విజయవంతంగా ప్రయోగించారు.
>> భారత్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేస్తుంది.
>> గత ఏడాది జనవరిలో మూడు క్షిపణి బ్యాటరీల సరఫరా కోసం ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.
