Asianet News TeluguAsianet News Telugu

Ship Hijack: ఆ షిప్ పై భారతీయులంతా సేఫ్.. రక్షించిన ఇండియన్ నేవీ

గురువారం సాయంత్రం హైజాక్ అయిన షిప్‌పై ఉన్న భారతీయలు, ఇతర ప్రయాణికులను ఇండియన్ నేవీ కాపాడింది. వారందరూ సురక్షితంగా ఉన్నారని, ఆ షిప్ పై పైరేట్లు ఎవరూ లేరని అధికారులు వెల్లడించారు.
 

indian navy rescues hijacked ship and aboard indiansn, other passengers and crew kms
Author
First Published Jan 5, 2024, 9:12 PM IST

Ship Hijack: నిన్న సాయంత్రం అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన కార్గో షిప్‌ను ఇండియన్ నేవీ ట్రేస్ చేసింది. ఆ షిప్ పై ఉన్న 15 మంది భారతీయులు సహా మొత్తం 21 ప్రయాణికులు, సిబ్బందిని కాపాడింది. వారంతా సేఫ్‌గా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ షిప్ పై హాజకర్లు ఎవరూ లేరని పేర్కొంది.

గురువారం సాయంత్రం ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్‌కు గురైంది. సోమాలియా తీరంలో ఈ ఘటన జరిగింది. దీన్ని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గుర్తించింది. వ్యూహాత్మక జలాల్లో నావల కదలికలను ట్రాక్ చేసే ఈ మేరిటైమ్ ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్ అయినట్టు వెల్లడించింది. దీంతో ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. ఎలైట్ కమాండోస్ మార్కోస్ రంగంలోకి దిగింది.

Also Read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అప్పుడే

నేవీ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నావల్ వార్షిప్.. పహారా బాధ్యతల నుంచి వీరిని కాపాడటానికి బయల్దేరింది. ఈ ఐఎన్ఎస్ చెన్నై హెలికాప్టర్‌ను పంపింది. హైజాక్ చేసిన పడవల నుంచి పైరేట్లు వెంటనే పారిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత వారిని చేరుకుని కాపాడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios