Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సినేషన్‌పై వ్యాఖ్యలు: న్యూట్రనిస్ట్ వీరమాచనేని రామకృష్ణపై ఐఎంఏ ఆగ్రహం.. కేసుకు డిమాండ్

ప్రముఖ న్యూట్రనిస్ట్ వీరమాచనేని రామకృష్ణపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం లేదని వీరమాచనేని ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఐఎంఏ.. మోడ్రన్ మెడిసిన్ చేతబడి కంటే హేయమైనదని వ్యాఖ్యానించింది

indian medical association fires on nutritionist veeramachaneni ramakrishna
Author
New Delhi, First Published Sep 1, 2021, 7:34 PM IST

ప్రముఖ న్యూట్రనిస్ట్ వీరమాచనేని రామకృష్ణపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం లేదని వీరమాచనేని ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఐఎంఏ.. మోడ్రన్ మెడిసిన్ చేతబడి కంటే హేయమైనదని వ్యాఖ్యానించింది. వీరమాచనేనికి చెందిన వీఆర్‌కే డైట్‌కు ఎలాంటి గుర్తింపు లేదని ఐఎంఏ తెలిపింది. వీరమాచనేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. 

కాగా, అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏకంగా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. అల్లోపతిని స్టుపిడ్ మెడిసిన్ అని, దీనివల్లే ఎంతోమంది కోవిడ్ రోగులు మృతి చెందుతున్నారని రాందేవ్ బాబా ఆరోపించారు. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ శాఖ అయితే బాబా రాందేవ్ 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్టాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్‌లు దాఖలైన విషయం తెలిసిందే..

Follow Us:
Download App:
  • android
  • ios