భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో భారత వాయుసేన యుద్ధ విమానాలు మోహరించింది. పాక్‌తో సరిహద్దు ఉన్న జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వైమానిక దళ యుద్ధ విమానాలను మోహరించింది.

ఇవి గురువారం రాత్రి విన్యాసాలు చేశాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఏం జరుగుతోందోనని భయాందోళనలకు గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా గత నెల 26న భారత వాయుసేన పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ కేంద్రంగా ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది.

దీనికి ప్రతీకారంగా పాక్ యుద్ధ విమానాలు భారత వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఐఏఎఫ్ పాక్ దాడిని తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.