స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)పై భారతదేశ జాతీయ జెండా ప్రదర్శించబడింది. 

బ్రిటీష్ పాలకుల దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న భారత్ నేడు 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు జరుపుకుంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయులు జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి దేశ భక్తిని చాటుకుంటున్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)పై భారత దేశ మువ్వన్నెల జెండా ప్రదర్శించబడింది. 

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి 12:01 గంటల సమయంలో బుర్జ్‌ ఖలీఫాపై ఎల్‌ఈడీ లైట్లతో భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. అదే సమయంలో జాతీయ గీతాన్ని కూడా ఫ్లే చేశారు. ఈ అత్యద్యుత సన్నివేశాన్ని తిలకించిన ప్రతి భారతీయుడు ఆనందంతో పులకించిపోయాడు. సగర్వంగా తాము భారతీయులం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరలవుతున్నాయి. నిజంగా ఈ అద్భుత సన్నివేశాన్ని తిలకిస్తే.. గూస్‌బంప్స్ రావాల్సిందే.

పాకిస్తాన్ కు ఘోర అవమానం

మరోవైపు నిన్న (ఆగస్టు 14న) స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న పాక్‌కు ఘోర అవమానం జరిగింది. సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ సారి పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం నాడు తమ జెండాను ప్రదర్శించకపోవడంతో పాకిస్థానీలు తీవ్ర నిరాశ చెందారు. తమకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక పాకిస్థానీయుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దుబాయ్ అదికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. భారత జాతీయ జెండా మాత్రం యథాతథంగా ప్రదర్శించబడింది. ప్రస్తుతం నెట్టింట్లో బుర్జ్‌ ఖలీఫా వద్ద పాకిస్థానీలు నిరాశకు గురైన వీడియో.. భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Scroll to load tweet…