భారత్ లో కరోనా మహమ్మారి ఏ విధంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ దాదాపు 4 లక్షల కేసులు నమోదౌతున్నాయి. దీంతో.. భారత్ లో  కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రపంచ దేశాలు సైతం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఓ ప్రకటన అందరినీ కలవరపెడుతోంది.

ప్రస్తుతం భారత్ లో ఉన్న కోవిడ్ వేరియంట్ ని ప్రపంచలోని  దాదాపు 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూఎన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది అక్టోబర్ లో భారత దేశంలో B.1.617 variant కోవిడ్ వైరస్ ని గుర్తించారు. కాగా.. ఇప్పుడు ఈ ఇండియన్ కోవిడ్ వేరియంట్ ని 44 దేశాల్లో దాదాపు 4,500 సాంపిల్స్ లో గుర్తించినట్లు చెప్పడం గమనార్హం.

వివిధ దేశాల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ మేరకు రిపోర్ట్స్ వచ్చాయట. అంటే.. భారత్ నుంచి ఈ మహమ్మారి ఇతర దేశాల్లోకి కూడా ప్రవేశిస్తోందని వారు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా..  భారత్ కాకుండా ఆ తర్వాత అంత స్థాయిలో బ్రిటన్ లో ఎక్కువగా కరోనా కేసులు ఉన్నట్లు గుర్తించారు. 

ఈ ఇండియన్ కోవిడ్ వేరియంట్.. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించారు.కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, దీనివల్ల ఇది ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అసలు వైరస్ కంటే ఈ వైరస్ తేలికగా వ్యాప్తిచెందుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. ప్రపంచంలోనే 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత్ కరోనా వ్యాప్తిలో మొదటి స్థానంలో, అమెరికా రెండవ స్థానంలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.