Asianet News TeluguAsianet News Telugu

దేశంలో కొత్త రకం వైరస్: ఆ మూడు రాష్ట్రాల్లో ప్రభావం

రూపు మార్చుకొన్న కరోనా దేశంలో విస్తరిస్తోంది.  దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

Indian Covid-19 mutation 'N440k' found in one-third of Andhra Pradesh's coronavirus genomes lns
Author
New Delhi, First Published Dec 28, 2020, 2:34 PM IST

న్యూఢిల్లీ: రూపు మార్చుకొన్న కరోనా దేశంలో విస్తరిస్తోంది.  దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటేడ్ బయోలజీ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.  కొత్త రకం వైరస్ కు ఎన్ 440కె గా పేరు పెట్టారు. యాంటీబాడీస్ నుండి కూడ ఈ వైరస్ తప్పించుకొనే లక్షణం ఉందని తేలింది.

 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఈ వైరస్ ఉనికిని గుర్తించారు. నోయిడాలో కోవిడ్ రీ ఇన్ ఫెక్షన్ కేసు ను గుర్తించినట్టుగా అధికారులు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ జనాబా 4.5 కోట్లు.  సీఎస్ఐఆర్ యొక్క ఇనిస్టిట్యూట్ ఫర్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటీవ్ బయలాజీ సైంటిస్టులు జన్యువులను విశ్లేషించింది.

దేశవ్యాప్తంగా 2 శాతం జన్యువులు ఆసియాలో జూలై ఆగష్టులో ఎన్ 440 కే మ్యూటేషన్ ను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా పై జాతీయ టాస్క్ ఫోర్స్ దేశంలోని కేసుల్లో 5 శాతం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించింది. కేరళలోని 14 జిల్లాల్లో ప్రతి ఒక్కటి కోవిడ్ 19 యొక్క వివరణాత్మక జన్యు అధ్యయనం చేయడానికి ఐజీఐబీ కేరళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది.

ఈ మ్యూటేషన్ క్లినికల్ ప్రాముఖ్యత గురించి తమకు తెలియదని తమకు తెలియదని  ఐజిఐబీ శాస్త్రవేత్త శ్రీధర్ శివసుబ్బూ చెప్పారు.133 దేశాల నుండి 2,40,000 కంటే ఎక్కువ జన్యువులను అధ్యయనం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios