‘విశ్వ సుందరి’ వేదికపై మెరిసిన ‘బంగారు పక్షి’ దివితా రాయ్
విశ్వ సుందరి వేదికపై భారత సుందరి దివితా రాయ్ బంగారు పక్షిగా మెరిసింది. గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద, పసిడి, నిధులు, ప్రకృతి శోభా, జంతువులతో, బహుళత్వం, మత సామరస్యం, ఆధ్యాత్మికత వంటి అరుదైన, ఉన్నతమైన విశేషాలతో విలసిల్లిన భారత దేశాన్ని బంగారు పక్షిగా కీర్తించేవారు. ఈ పేరును వెల్లడించేలా బంగారు పక్షి ఔట్‌ఫిట్‌ను ధరించి దివితా రాయ్ అందరితో వావ్ అనిపించారు.

న్యూఢిల్లీ: విశ్వ సుందరి వేదిక పై భారత్ తరఫున దివితా రాయ్ బంగారు పక్షిగా మెరిసింది. వేదిక పై నుంచి అందరినీ మైమరిపింపజేసింది.ఆమె తన ఔట్‌ఫిట్‌తో భారత ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. మన దేశ గొప్ప సాంస్కృతిక సంపద, ఆధ్యాత్మికత, బహుళత్వం మున్నగు వాటిని తన ఔట్‌ఫిట్ ద్వారా ఉన్నతంగా ప్రదర్శించింది. కోహినూర్ వజ్రం నుంచి వ్యవసాయం వరకు, భారత్ గొప్పతనాన్ని తలపించే శిఖరాల వరకు ఆమె తన డ్రెస్ ద్వారా తెలిపింది. డబ్బు, పసిడి, నిధులు మొదలు జంతువులు, అందం వరకు పురాతన భారత దేశం దేనికీ కొదవలేకుండా ఉండింది. అందుకే మన దేశాన్ని బంగారు పక్షి అని పిలిచేవారు. ఆ పిలుపును ప్రస్ఫుటించేలా దివితా రాయ్ తన ఔట్‌ఫిట్‌తో ఆమె బంగారు పక్షిలా వేదిక పై మెరిసింది. మన దేశ సుగుణాన్ని అందంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంల అమెరికాలోని లూసియానా, న్యూ ఓర్లియాన్స్‌లోని ఎర్నెస్ట్ ఎన్ మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. 2001 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కౌర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ నిక్ తేప్లిజ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బంగారు పక్షిని తలపించేలా అందమైన ఈ ఔట్‌ఫిట్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అభిషేక్ శర్మ రూపొందించారు. ఈ ఔట్‌ఫిట్ రూపకల్పనకు ప్రేరణ ఇచ్చిన అంశాల గురించి ఆయన మాట్లాడుతూ, మన దేశం తరఫున ప్రదర్శన ఇస్తుండటంతో మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందులో ప్రతిబింబించేలా డిజైన్ చేయాలని భావించానని వివరించారు. అందుకే ఈ డ్రెస్ కోసం ప్రధాన నగరాల నుంచి వేర్వేరు ఎలిమెంట్లు, వస్తువులను సేకరించి డిజైన్ చేశానని తెలిపారు. అందుకే మన దేశ నిర్మల స్వభావాన్ని వెల్లడించేలా జాగ్రత్తగా డిజైన్ చేశానని పేర్కొన్నారు. ఈ ఔట్‌ఫిట్‌తో దివితా రాయ్ నిజంగానే బంగారు పక్షిగా కనిపించి మురిపించింది.
71వ మిస్ యూనివర్స్ కార్యక్రమం యూఎస్‌లోని లూసియానా న్యూ ఓర్లియాన్స్, ఎర్నెస్ట్ ఎన్ మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 84 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆ పోటీల్లో విజేతకు భారత్‌కు చెందిన విశ్వసుందరి హర్నాజ్ కౌర్ సంధు కిరీటాన్ని బహూకరిస్తారు.
ఈ కార్యక్రమం వూట్ సెలెక్ట్, జియో టీవీలో లైవ్‌లో టెలికాస్ట్ అవుతుంది.