భారత సైన్యంలో ఉన్నతాధికారులందరూ కామన్ యూనిఫాం కలిగి ఉండేలా ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుండి బ్రిగేడియర్, అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లోని అధికారులందరూ ఆర్మీ కామన్ యూనిఫాం కలిగి ఉండనున్నారు.

భారత సైన్యంలో ఉన్నతాధికారులందరూ కామన్ యూనిఫాం కలిగి ఉండేలా ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుండి బ్రిగేడియర్, అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లోని అధికారులందరూ ఆర్మీ కామన్ యూనిఫాం కలిగి ఉండనున్నారు. ఈ చర్య న్యాయమైన, సమానమైన సంస్థగా ఉండటానికి బలగాల లక్షణాన్ని మరింత బలోపేతం చేస్తుందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. తద్వారా సీనియర్ అధికారులకు సంబంధించి సేవా విషయాలలో ఉమ్మడి గుర్తింపు, విధానాన్ని ప్రోత్సహించడం, బలోపేతం చేయడం భారత ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

బ్రిగేడియర్ స్థాయిలో అధికారులకు, అంతకంటే ఎక్కువ ర్యాంకులైన మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్‌ అధికారులకు రెజిమెంటేషన్ సరిహద్దులు లేవని గమనించాలి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇటీవల ముగిసిన ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్‌లో అన్ని వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులతో సవివరమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

యూనిఫాం ఎలా ఉంటుంది?
ఫ్లాగ్ ర్యాంక్ (బ్రిగేడియర్ మరియు అంతకంటే ఎక్కువ) సీనియర్ అధికారుల హెడ్‌గేర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జ్‌లు, గోర్జెట్ ప్యాచ్‌లు, బెల్ట్‌లు, షూలు ఇప్పుడు ప్రామాణికమైనవి. ఫ్లాగ్-ర్యాంక్ అధికారులు ఇప్పుడు ఎలాంటి లాన్యార్డ్స్ ధరించరు. కల్నల్‌లు, కింది స్థాయి అధికారులు ధరించే యూనిఫాంలో ఎలాంటి మార్పు లేదని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇండియన్ ఆర్మీలో బ్రిగేడియర్, ఆ పై ర్యాంకు అధికారులు ఇప్పటికే యూనిట్లు, బెటాలియన్లు మరియు కమాండ్ చేసిన వారు కావడంతో.. వారు ఎక్కువగా ప్రధాన కార్యాలయాలలో, అన్ని ఆయుధాలు, సేవలకు చెందిన అధికారులు కలిసి పనిచేసే చోట పోస్టింగ్ చేయబడతారనే సంగతి తెలిసిందే. ‘‘ఒక ప్రామాణిక యూనిఫాం భారతీయ సైన్యం నిజమైన నైతికతను ప్రతిబింబిస్తూ సీనియర్-ర్యాంక్ అధికారులందరికీ ఉమ్మడి గుర్తింపును నిర్ధారిస్తుంది’’ ఆ వర్గాలు పేర్కొన్నాయి.. 

‘‘వివిధ రకాల యూనిఫాం, అకౌట్‌మెంట్‌లు భారతీయ సైన్యంలోని సంబంధిత ఆయుధాలు, రెజిమెంట్‌లు, సేవలకు నిర్దిష్ట అనుబంధాన్ని కలిగి ఉంటాయి’’ అని సంబధింత వర్గాలు చేశారు. ఇక, గత సంవత్సరం.. భారత సైన్యం యుఎస్ ఆర్మీ లాగా డిజిటల్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫామ్‌ను స్వీకరించింది.