Asianet News TeluguAsianet News Telugu

హిమపాతాలలో చిక్కుకున్న 30 మందిని రక్షించిన ఇండియన్ ఆర్మీ..

జమ్మూ కశ్మీర్‌లో హిమపాతాలలో (avalanches) చిక్కుకున్న 30 మందిని భారత ఆర్మీ (Indian Army ) రక్షించింది. తంగ్‌ధర్‌లో రెండు వేర్వేరు హిమపాతాలలో చిక్కుకున్న పౌరులను జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కలిసి రెస్క్యూ చేసినట్టుగా ఓ అధికారి తెలిపారు. 

Indian Army rescues 30 civilians trapped in avalanches in Jammu and Kashmir
Author
Srinagar, First Published Jan 18, 2022, 5:19 PM IST

జమ్మూ కశ్మీర్‌లో హిమపాతాలలో (avalanches) చిక్కుకున్న 30 మంది పౌరులను భారత ఆర్మీ (Indian Army ) రక్షించింది. తంగ్‌ధర్‌లో రెండు వేర్వేరు హిమపాతాలలో చిక్కుకున్న పౌరులను జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కలిసి రెస్క్యూ చేసినట్టుగా ఓ అధికారి తెలిపారు. చౌకీబాల్-తంగ్‌ధర్ రహదారిపై సోమవారం రాత్రి తర్వాత వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్.. 30 మంది పౌరులను రక్షించారు. రహదారిపై హిమపాతంలో చిక్కుకుపోయిన 12 వాహనాలు తర్వాత బయటపడ్డాయి.

చౌకీబాల్-తంగ్‌ధర్ రహదారి జాతీయ రహదారిపై ఖూనీ నాలా, SM హిల్ ప్రాంతాల్లో రెండు హిమపాతాలు సంభవించాయి. పౌరులు తమ వాహనాల్లో హిమపాతంలో చిక్కుకుపోయారని సాధన పాస్‌లోని దళాలకు సోమవారం రాత్రి సమాచారం అందినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో వారు వెంటనే.. ఇండియన్ ఆర్మీ నుంచి రెండు హిమపాతాల రెస్క్యూ బృందాలు, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (జిఆర్‌ఇఎఫ్) బృందాన్ని సమీకరించినట్టుగా చెప్పారు. 

ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్మీ రెస్క్యూ బృందాలు.. 14 మంది పౌరులను రక్షించి నీలంకు, 16 మంది పౌరులను సాధన పాస్‌కు తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. ఇక, రక్షించబడిన పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం, ఆశ్రయం కల్పించారు. రోడ్డుపై హిమపాతం, మంచు స్లైడ్స్ తొలగించిన తర్వాత 12 వాహనాలు తిరిగి పొందారు.

 

రక్షించబడిన పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం మరియు ఆశ్రయం కల్పించారు. రోడ్డుపై నుంచి హిమపాతం, మంచు స్లైడ్స్ క్లియరెన్స్ తర్వాత మంగళవారం పగటిపూట పన్నెండు వాహనాలు తిరిగి పొందబడ్డాయని అధికారులు తెలిపారు. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టిందని చెప్పారు. 

ఇక, ఖూనీ నాలా ప్రాంతంలో హిమపాతాలు, మంచు స్లైడ్‌లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతేడాది కూడా సాయుధ బలగాలు.. ఈ ప్రాంతంలో హిమపాతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios