మారుతున్న కాలం, పెరుగుతున్న సవాళ్ల మధ్య భారత సైన్యాన్ని ఆధునీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమంలో భాగంగా భారత సైన్యం డిజిటలైజేషన్,ఆటోమేషన్‌  దిశగా ముందుకు సాగుతోంది.  

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారత సైన్యం డిజిటలైజేషన్,ఆటోమేషన్‌ దిశగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమంలో భాగంగా సైన్యం ఇటీవల అనేక కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేసింది. అలాగే భారత సైన్యం సామర్థ్యం పెంపుదల, సామర్థ్య అభివృద్ధి కోసం సాంకేతిక ప్రయోజనాలను పొందేందుకు అనేక ప్రాజెక్టులను చేపట్టింది. దీని ద్వారా దేశ సేవలో నిమగ్నమైన సైనికులకు అత్యుత్తమ సౌకర్యాలను అందించవచ్చు. శత్రు దేశాలను సామర్థవంతంగా ఎదుర్కోనవచ్చు.

ఈ క్రమంలో సైన్యం కోసం సిట్యుయేషనల్ అవేర్‌నెస్ మాడ్యూల్ (SAMA), సిట్యుయేషనల్ రిపోర్టింగ్ ఓవర్ ఎంటర్‌ప్రైజ్-క్లాస్ GIS ప్లాట్‌ఫామ్ (E-Sitrep), ఆర్మీస్ ఓన్ గాటిశక్తి (AVAGAT), ఆర్టిలరీ కంబాట్ కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ACCCCS), ప్రాజెక్ట్ సంజయ్ (యుద్ధభూమి నిఘా వ్యవస్థ), ఇండియన్ ఆర్మీ డేటా రిపోజిటరీ , అనలిటిక్స్ అప్లికేషన్ (ఇండియన్ ఆర్మీ డేటా రిపోజిటరీ అండ్ ఎనలిటిక్స్-INDRA)ను ప్రారంభించింది.

ప్రాజెక్ట్ సంజయ్: యుద్ధ ప్రాంతంలో నిఘా వ్యవస్థను మెరుగుపరచడానికి ఉద్దేశించిందే ప్రాజెక్ట్ సంజయ్. ఈ ప్రాజెక్ట్ కింద పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏకీకృతం చేస్తారు. క్షేత్ర నిర్మాణం కోసం నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అదనంగా వారు ఆర్టిలరీ కంబాట్ కమాండ్ , కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ACCCS)కి అనుసంధానించబడతారు. దీని కారణంగా కమాండర్లు, ఇతర సిబ్బంది సైన్యం యొక్క సమగ్ర నిఘాను మెరుగైన మార్గంలో చేయగలుగుతారు. ఈ ప్రాజెక్ట్ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విజయవంతమైన ట్రయల్స్ జరిగాయి. డిసెంబర్ 2025 నాటికి సైన్యంలోకి చేర్చబడుతుందని నమ్ముతారు. BEL ఘజియాబాద్ ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది. 

ప్రాజెక్ట్ అవగత్ : ప్రధానమంత్రి గతిశక్తి నుండి ప్రేరణ పొంది, ఒకే GIS ప్లాట్‌ఫారమ్ ద్వారా బహుళ డొమైన్‌లలో అవగాహనను తీసుకురావడానికి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ దశలవారీగా అమలు చేయబడుతుంది. మొదటగా అన్ని రకాల లాజిస్టిక్ ఇన్‌పుట్‌లు, ఉపగ్రహ చిత్రాల డేటా, టోపోగ్రాఫికల్ , మెట్రాలజీ ఇన్‌పుట్స్ ప్రాజెక్ట్ అవగత్ కిందకు తీసుకువస్తామని ఇండియన్ ఆర్మీ సోర్స్ తెలిపింది. ఈ ఉమ్మడి ప్లాట్‌ఫారమ్ , సిస్టమ్ ఈ సంవత్సర చివరి వరకు పూర్తిగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

సిట్యుయేషనల్ అవేర్‌నెస్ మాడ్యూల్ (SAMA) : సైన్యం పని చేస్తున్న ఇతర ప్రాజెక్టులలో SAMA ( సిట్యుయేషనల్ అవేర్‌నెస్ మాడ్యూల్) ఒకటి. సైన్యం యొక్క పోరాట సమాచార నిర్ణయ మద్దతు వ్యవస్థ . ఇది యుద్ధభూమి పరిస్థితిపై సైన్యానికి మరింత అవగాహనను పెంచుతుంది. ఇది యుద్ధభూమిలో నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. మూలాల ప్రకారం.. ఈ నెలలో ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం SAMA ప్రాజెక్ట్ కార్పస్ జోన్‌లో ప్రారంభించబడుతుంది.

 E-CITREP: యుద్ద సమయంలో పర్యావరణాన్ని త్వరగా అర్థం చేసుకోవడానికి దీనిని రూపొందించారు. తదనుగుణంగా సైన్య సామర్థ్యాన్ని పెంచడానికి సమాచారాన్ని అందించడం. నిర్దిష్టమైన, సరైన సమాచారంతో శత్రువును ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకం ఆర్మీలో అమల్లోకి రానుంది.

INDRA అప్లికేషన్: సైన్యంలో మోహరించిన సిబ్బంది అందరి డేటాను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖకు పెద్ద సవాలుగా మారింది. ఈ తరుణంలో రూపొందించబడిందే INDRA అప్లికేషన్. ఆర్మీలో పోస్ట్ చేయబడిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ (JCOలు), ఇతర ర్యాంక్‌ల డేటాబేస్‌ను నిర్వహించడం ఈ అప్లికేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ అప్లికేషన్ కింద.. 47 రికార్డ్ ఆఫీస్‌లలో నిర్వహించబడే రెజిమెంట్లు/ఆయుధాలు/సేవల సిబ్బంది డేటా మిళితం చేయబడుతుంది. ఈ అప్లికేషన్ వివిధ లబ్ధిదారులకు వారి సేవ , చార్టర్ ప్రకారం గణాంక విశ్లేషణ కోసం డేటా , సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయడం , సంగ్రహించడం సులభతరం చేస్తుంది. వీటితో పాటు ప్రాజెక్ట్ అనుమాన్‌ కూడా త్వరలో ఆర్మీలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.