పుల్వామా ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. సైనికులు ఆకస్మిక తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి. 

అసలు వివరాల్లోకి వెళితే.. అవంతిపొరా పరిధిలోని బ్రాబందిన ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుసుకున్న ఇంటిలిజెన్స్ అధికారులు భారత సైన్యంను అలెర్ట్ చేశారు. జవానులు అన్వేషిస్తుండగా ఇద్దరు ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. 

అప్రమత్తమైన భారత జవానులు ప్రతిదాడికి దిగడంతో కొన్ని నిమిషాల వరకు ఆ ప్రాంతమంతా తుపాకుల మోతతో దద్దరిల్లింది. భారత సైనికులు చాకచక్యంగా వ్యవహరించి కొద్దిసేపటికి ఉగ్రవాదులను అంతమొందించారు. వెంటనే వారి స్థావరాలను పరిశీలించి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.