పాకిస్థాన్ లో నూతనంగా ఏర్పడిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూడా పాక్ ఆర్మీని కట్టడి చేయడంలో విఫలమవుతోందని ఇండియన్ ఆర్మీ చీప్ బిపిన్ రావత్  వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ పాలనలో కూడా పాకిస్థాన్ ఆర్మీ భార్డర్ టెర్రరిజం, హింసకు ప్రోత్సహిస్తోందని రావత్ స్పష్టం చేశారు. మై నేషన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రావత్ భారత్,పాక్ సంబంధాలు, భారత ఆర్మీకి సంబంధించిన పలు విషయాల గురించి వెల్లడించారు. మై నేషన్ చీఫ్ ఎడిటర్ అభిజిత్ ముజుందర్, డిఫెన్స్ కరస్పాండెంట్ అజిత్ కె దూబేలు   రావత్ ను ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికరమైన విషయాలకు సంబంధించిన సమాచాన్ని అందించారు.

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని రావత్ పేర్కొన్నారు. అంతేకాదు భారత్,  పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాల్లో కూడా మార్పులేమీ కన్పించలేదన్నారు. ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వ పాలనలో కూడా ఎల్వోసి వద్ద ఎలాంటి పరిస్థితులున్నాయో భారతీయులందరికి తెలుసని రావత్ వివరించారు.   

2016 లో జరిగిన యూరి ఘటనకు ప్రతికారంగా భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసి గట్టి జవాబిచ్చిందన్నారు. గతంలో ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన 26/11 వంటి దాడులు  పునరావృతమైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఈ సర్జికల్ స్ట్రైక్ వల్ల ముందే హెచ్చరించినట్లయిందని రావత్ తెలిపారు.  

ఇంకా బిపిన్ రావత్ చాలా ఆసక్తికర విషయాల  గురించి ఇంటర్వ్యూలో తెలియజేశారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియోను చూడండి.  


సంబంధిత వార్త( ఇంగ్లీష్‌లో) 

‘Pakistan’s support for terror unabated under Imran Khan; India will reply if another 26/11 happens’: Gen Bipin Rawat