ఆర్చర్ అభిషేక్ వర్మ భార్య బ్యాగు చోరీకి గురయ్యింది. గురువారం రాత్రి 7.30 గంటలకు ఆమె కారు అద్దాలు పగలగొట్టి బ్యాగు దొంగిలించారు. ఈ ఘటన రోహిణి సెక్టార్ 7-8లో జరిగింది.

ఢిల్లీ : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారత ఆర్చర్‌ Abhishek Verma భార్య బ్యాగ్‌ ల్యాప్‌టాప్‌, కొన్ని పత్రాలు, లక్ష రూపాయలకుపైగా నగదు చోరీకి గురైందని కేసు నమోదైంది. నిందితులను పట్టుకునేందుకు Delhi Police ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు.

“సాయంత్రం నా భార్య తన ఆఫీసు నుండి ఇంటికి వెళుతోంది. షాపింగ్ కోసం ఆమె తన ఆడి కారును Rohini Sector 7-8 దగ్గర పార్క్ చేసింది. అయితే కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి కారు అద్దాలు పగులగొట్టి ఉన్నాయి. కారులో ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగ్ చోరీకి గురైంది. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో ల్యాప్‌టాప్, కొన్ని పత్రాలు, లక్ష రూపాయలకు పైగా నగదు ఉన్నాయి” అని ఆర్చర్ చెప్పాడు.

ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో సీసీటీవీని పరిశీలించారు. దాదాపు ఏడుగురు వ్యక్తులు ఈ-రిక్షాను డీబోర్డ్ చేయడం కనిపించింది, వారు కారు అద్దాలను పగలగొట్టి బ్యాగ్ దొంగిలించి పారిపోయారు”అని వర్మ తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 7.30 గంటలకు ఆర్చర్ భార్య షాపింగ్ కోసం రోహిణి సెక్టార్ 7-8లో ఆగినప్పుడు ఈ ఘటన జరిగింది. “సీసీటీవీ ఫుటేజీలో ఈ-రిక్షా కారు వద్దకు వస్తున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి నిందితుడిని పట్టుకునేందుకు బృందాన్ని పంపాం. ఈ విషయంపై విచారణ జరుగుతోంది' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

2014 ఆసియా గేమ్స్‌లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్‌లతో కూడిన పురుషుల కాంపౌండ్ టీమ్‌తో అభిషేక్ వర్మ స్వర్ణం సాధించాడు. 2014లో కూడా అర్జున అవార్డును అందుకున్నారు. 2014లో ఇంచియాన్ గేమ్స్‌తో కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్‌లో విజయం సాధించాడు.. దీంతో పాటు 2018 జకార్తా గేమ్స్‌లో కాంపౌండ్ టీమ్‌తో రజతాన్ని గెలుచుకున్నాడు.