ఇండియన్ అమెరికన్ గౌతమ్ రాఘవన్‌కు (Gautam Raghavan) పదోన్నతి లభించింది. ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌న‌ల్ హెడ్‌గా అవకాశం కల్పించారు. 

అమెరికాలో మరో భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక భాద్యతల్లో నియమితులయ్యారు. ఇండియన్ అమెరికన్ గౌతమ్ రాఘవన్‌కు (Gautam Raghavan) పదోన్నతి లభించింది. ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌న‌ల్ హెడ్‌గా అవకాశం కల్పించారు. ప్రస్తుతం వైట్ హౌస్ పీపీఓ‌గా క్యాథీ రస్సెల్‌ను UNICEF తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని యూఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన ఉద్దేశాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్యాథీ రస్సెల్ స్థానంలో గౌతమ్ రాఘవన్‌ను నియమించాలని జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. 

కాథీ నాయకత్వంలో వైట్ హౌస్ (White House) ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ (PPO) బాగా పనిచేసిందని జో బైడెన్ తెలిపారు. నియామకాల్లో వేగంగా, వైవిధ్యంగా పనిచేసి రెండింటిలోనూ రికార్డులు బద్దలు కొట్టిందన్నారు. తమ ఫెడరల్ ప్రభుత్వాన్ని ప్రతిబింబిచేలా నిర్విరామంగా కృషి చేసిందని చెప్పారు. ‘మొదటి రోజు నుండి క్యాథీతో కలిసి పనిచేసిన గౌతమ్ రాఘవన్ PPO.. కొత్త డైరెక్టర్‌గా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది..సమర్థవంతమైన, ప్రభావవంతమైన, ఆధారపడదగిన, విభిన్నమైన సమాఖ్య వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడాన్ని కొనసాగించడానికి మాకు సహాయపడే వ్యక్తి’ అని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

గౌత‌మ్ రాఘ‌వ‌న్ ఇండియాలో పుట్టారు. సియాటిల్‌లో ఆయ‌న‌ పెరిగారు. స్టాన్‌ఫార్డ్ యూనివ‌ర్సిటీలో (Stanford University) ఆయ‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. వెస్ట్ వింగ‌ర్స్‌.. స్టోరీస్ ఫ్ర‌మ్ ద డ్రీమ్ చేజ‌ర్స్, చేంజ్‌మేక‌ర్స్‌, హోప్ క్రియేట‌ర్స్ ఇన్‌సైడ్ ద ఒబామా వైట్ హౌజ్ అన్న పుస్త‌కానికి ఆయ‌న ఎడిట‌ర్‌గా చేశారు. రాఘవ‌న్ ఆయ‌న స్వ‌లింగ సంప‌ర్కుడు. భ‌ర్త‌, కూతురితో క‌లిసి వాషింగ్ట‌న్ డీసీలో జీవిస్తున్నారు. బైడెన్‌-హ్యారిస్ ప‌రిపాల‌నా విభాగం తొలుత రిక్రూట్ చేసింది రాఘ‌వ‌న్‌నే.

‘ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో.. రాఘవన్ వైట్ హౌస్ పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ కార్యాలయంలో LGBTQ కమ్యూనిటీతో పాటు ఆసియా అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ కమ్యూనిటీకి అనుసంధానకర్తగా, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌కు వైట్ హౌస్ అనుసంధానకర్తగా పనిచేశారు’ అని వైట్ హౌస్ పేర్కొంది