బెంగళూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ద విమానం బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ విమానాశ్రయంలో శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కుప్పకూలిపోయి ఇద్దరు ఫైలట్లు మృతిచెందారు. 

భారత వాయు సేనకు చెందిన మిరాజ్‌ 2000 విమానాన్ని రక్షణ శాఖ శిక్షణ కోసం ఉపయోగిస్తోంది. అందులో భాగంగా బెంగళూరులోని హాల్ విమానాశ్రయంలో పైలట్లు శిక్షణ పొందుతుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తిం విమానం కుప్పకూలింది. వెంటనే భారీగా మంటలు చెలరేగి అందులో వున్న ఇద్దరు పైలట్లు తీవ్ర గాయాలపాలయ్యారు.   

ఈ ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే విమానంలోని ఓ పైలట్ మృతిచెందగా  మరో పైలట్ తీవ్ర గాయాలతో పడివున్నాడు. అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. 

ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుండి విమాన శకలాలతో పాటు, కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.