భారతీయ టెక్నాలజీతో AI మోడల్‌ను రూపొందించడానికి, స్టార్టప్‌లు, పరిశోధకులు, వ్యాపారవేత్తల నుండి IndiaAI టెండర్లను ఆహ్వానిస్తోంది. సొంత టెక్నాలజీతో ప్రపంచ స్థాయి AI మోడల్‌ను రూపొందించడమే లక్ష్యం. మరిన్ని వివరాలకు tenders@indiaai.gov.in ద్వారా సంప్రదించవచ్చు.

భారతీయ డేటాసెట్‌లతో అత్యాధునిక AI మోడల్‌ను రూపొందించడానికి స్టార్టప్‌లు, పరిశోధకులు, వ్యాపారవేత్తల నుండి కేంద్ర ప్రభుత్వం టెండర్లను కోరింది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా AI (IndiaAI) ఈ ప్రకటనను విడుదల చేసింది.

భారత సాంకేతికతతో సవాళ్లను ఎదుర్కొంటూనే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే ఈ ప్రయత్నం వెనక ఆలోచనగా తెలుస్తోంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్వదేశీ AI మోడల్‌ను రూపొందించడమే లక్ష్యంగా ఇండియా AI పనిచేస్తోంది. అందులో భాగంగానే తాజా ప్రయత్నం చేస్తోంది. 

ప్రస్తుత AI వ్యవస్థలోని లోపాలను తగ్గించడానికి, సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి భారత్ ప్రయత్నిస్తోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే ఆలోచనలో భాగంగా ఇండియా AI ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. IndiaAI ప్రాజెక్ట్ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద పనిచేస్తుంది.

 IndiaAI ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా భారతదేశం AI మోడళ్లను రూపొందించడానికి మద్దతు ఇవ్వాలని భారతీయ పరిశోధకులు, స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాని ప్రకారం భారతీయ డేటాసెట్‌లతో శిక్షణ పొందిన అత్యాధునిక AI మోడళ్లను రూపొందించడానికి ప్రతిపాదనలు ఆహ్వానించారు.

భారతీయ టెక్నాలజీలో వున్న ప్రత్యేకమైన సవాళ్లు, అవకాశాలను ఎదుర్కొంటూనే ప్రపంచ ప్రమాణాలకు సరిపోయే AI మోడల్‌ను సృష్టించడమే ఈ ప్రయత్నం లక్ష్యం. AI సాంకేతికతలో ప్రపంచ స్థాయిలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం అని IndiaAI విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

IndiaAI ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం tenders@indiaai.gov.in అనే ఇమెయిల్ చిరునామా ద్వారా సంప్రదించవచ్చు.