Asianet News TeluguAsianet News Telugu

హర్మన్‌ప్రీత్‌ కౌర్ కు కరోనా పాజిటివ్ !

భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కరోనా బారిన పడ్డారు. ఆమెకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఐదు రోజుల వన్డే మ్యాచ్ లో మార్చి 17 న గాయడడంతో ఆమె లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన టి 20 సిరీస్‌లో ఆడలేదు. ఆ తరువాత కౌర్ కు తేలికపాటి జ్వరంతో బాధపడ్డారు. దీంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ తేలింది. 

India women T20 captain Harmanpreet Kaur tests COVID-19 positive - bsb
Author
Hyderabad, First Published Mar 30, 2021, 12:40 PM IST

భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కరోనా బారిన పడ్డారు. ఆమెకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఐదు రోజుల వన్డే మ్యాచ్ లో మార్చి 17 న గాయడడంతో ఆమె లక్నోలో దక్షిణాఫ్రికాతో జరిగిన టి 20 సిరీస్‌లో ఆడలేదు. ఆ తరువాత కౌర్ కు తేలికపాటి జ్వరంతో బాధపడ్డారు. దీంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ తేలింది. 

“దురదృష్టవశాత్తు నేను COVID-19 పాజిటివ్ బారిన పడ్డాను. అయినా పర్వాలేదు. కోవిడ్ గైడ్ లైన్స్, అధికారులు, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ క్వారంటైన్ అయ్యాను”అని హర్మన్‌ప్రీత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

"గత 7 రోజులుగా నాతో ఉన్నవారందరూ ముందు జాగ్రత్తగా కోవిడ్ పరీక్షలు చేయించుకోమని కోరుతున్నాను. దేవుడి దయ, మీ అందరి అభిమానం వల్ల నేను త్వరలోనే కోలుకుని, మైదానంలోకి వస్తాను. మీరందరూ మాస్క్ లు తప్పనిసరిగా పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి"అని తన ట్విటర్ ఖాతా పోస్టులో కోరారు. 

కౌర్ వన్డేల్లో ఒక అర్ధ సెంచరీ, 40 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారు. 12 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన భారత్ వన్డే, టి 20 సిరీస్ రెండింటినీ చేజార్చుకుంది.

ఇంతకుముందు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోమవారం (మార్చి 29) కోవిడ్ -19 పాజిటివ్‌ గా తేలారు. ఇప్పటివరకు కరోనా బారిన పడిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. పఠాన్ ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన వెటరన్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. దీంతో ఇది సూపర్ స్ప్రెడర్ గా మారే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇర్ఫాన్‌ కంటే ముందు, అతని సోదరుడు యూసుఫ్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఎస్. బద్రీనాథ్ లు తాము కోవిడ్ -19 బారిన పడ్డామని స్వయంగా ట్విటర్ లో ప్రకటించారు. 

‘నాకు లక్షణాలేమీ లేవు. అయినా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. నేను ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉన్నాను. ఈ మధ్య కాలంలో నాతో కలిసినవారు తప్పనిసరిగా టెస్టు చేయించుకోమని అభ్యర్థిస్తున్నాను’ అని ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.

అంతేకాదు "మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అందరినీ కోరుతున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని కూడా ట్వీట్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios