Asianet News TeluguAsianet News Telugu

జస్ట్ 8 ఇయర్స్: జనాభాలో చైనాను క్రాస్ చేయనున్న ఇండియా

ఇప్పటికే అధిక జనాభాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నభారతదేశానికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఐక్యరాజ్యసమితి. ‘‘ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్‌ 2019: హైలెట్స్’’ పేరుతో యూఎన్ఓ ఆర్ధిక, సామాజిక వ్యవహారాల విభాగం సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది

india will over take china as most populous country in the world
Author
New Delhi, First Published Jun 18, 2019, 12:35 PM IST

ఇప్పటికే అధిక జనాభాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నభారతదేశానికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఐక్యరాజ్యసమితి. ‘‘ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్‌ 2019: హైలెట్స్’’ పేరుతో యూఎన్ఓ ఆర్ధిక, సామాజిక వ్యవహారాల విభాగం సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది.  

దీనిలో భాగంగా ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా... 2050 నాటికి రెండు బిలియన్లు పెరిగి 9.7 బిలియన్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇక ఈ దశాబ్ధం చివరి నాటికి ప్రపంచ జనాభా దాదాపు 11 బిలియన్లకు చేరే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొంది.

వచ్చే ఎనిమిదేళ్లలో చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని తెలిపింది. అప్పటి నుంచి దశాబ్ధం చివరి వరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్ కొనసాగనుందని...2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3 కోట్లు పెరిగే అవకాశముందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

రానున్న 30 ఏళ్లలో భారత్‌తో పాటు నైజీరియా, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు అమెరికాలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండనుందని నివేదిక తెలిపింది.

ప్రపంచ జనాభా పెరుగుదలలో కేవలం 9 దేశాల్లోనే నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.

143 కోట్ల మందితో చైనా, 137 కోట్లతో భారత్ రెండో స్థానంలో, 32.9 కోట్లతో అమెరికా నాలుగు, 27.1 కోట్ల మందితో ఇండోనేషియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2050 తర్వాత భారత్ అగ్రస్థానంలో చైనా, నైజీరియా, అమెరికా, పాక్ జనాభాలో టాప్‌-5లో ఉంటాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios