పండోరా పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. పండోరా పేపర్స్ లీకేజీ విషయమై మల్టీ గ్రూప్ ఏజెన్సీతో విచారణ నిర్వహించనున్నట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది.117 దేశాల్లోని 600 మంది జర్నలిస్టులు సమిష్టిగా పనిచేసి గుట్టు రట్టు చేశారు.

న్యూఢిల్లీ: పండోరా పేపర్స్(pandora papers) లీక్ ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం (finace ministry) తీసుకొంది. పండోరా పేపర్స్ కి సంబంధించిన కేసులను దర్యాప్తు(investigate) చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

పండోరా పేపర్స్ లీకేజీ ఘటన దేశంలో కలకలం రేపుతోంది. ఇండియాకు (india)చెందిన పలువురి పేర్లు వెలుగు చూశాయి. పన్ను తక్కువ ఉన్న విదేశాలకు సంపదను తరలించిన వారి వివరాలు బయటకు వచ్చాయి.

117 దేశాల్లోని 600 మంది జర్నలిస్టులు సమిష్టిగా పనిచేసి గుట్టు రట్టు చేశారు. ఈ విషయమై దర్యాప్తు సంస్థలు విచారణను చేపడుతాయని కేంద్ర ఆర్ధికశాఖ సోమవారం నాడు ప్రకటించింది.

also read:పండోరా పేపర్లు: బట్టబయలైన సంపన్న ప్రపంచ నేతల అసలు రూపం

సీబీడీటీ(cbdt) ఛైర్మెన్, జేబీ మొహపాత్రా నేతృత్వంలోని సీబీడీటీ, ఈడీ,(de) ఆర్‌బీఐ(rbi. ఎఫ్ఐయూ (fiu)ప్రతినిధులు కలిగిన మల్టీ ఏజెన్సీ గ్రూప్ విచారణ నిర్వహిస్తోందని కేంద్ర ఆర్ధిక శాఖ వివరించింది.

సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తగిన చర్యలు తీసుకోనున్నట్టుగా ప్రకటించింది.సంబంధింత పన్ను చెల్లింపుదారులు లేదా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పొందడం కోసం ప్రభుత్వం విదేశాలతో కూడ సంప్రదింపులు జరుపుతుందని ప్రభుత్వం ప్రకటించింది.