Asianet News TeluguAsianet News Telugu

India Exports: భారీగా పెరిగిన ఎగుమతులు.. డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాణిజ్యం

India Exports:  భారతదేశ సరుకుల ఎగుమతులు 2021 డిసెంబర్‌లో 38.91 శాతం పెరిగి 37.81 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో $27.22 బిలియన్లతో పోలిస్తే, ఇది 39% పెరుగుదల క‌నబ‌రిచిన‌ట్టు అధికారిక గణాంకాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు, సరుకుల ఎగుమతులు 300 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్, కెమికల్స్ వంటి రంగాల సానుకూల వృద్ది కార‌ణంగా ఈ వృద్ది సాధించింది.
 

India trade deficit at 21.7billion  in Dec as imports rise 38 percentage
Author
Hyderabad, First Published Jan 14, 2022, 4:20 PM IST

India Exports:  భారతదేశం ఎగుమ‌తుల్లో సానుకూల వృద్దిని సాధించింది. డిసెంబ‌ర్ 2021లో  భారతదేశం మొత్తం ఎగుమతులు (మర్చండైజ్ అండ్ సర్వీసెస్)  డిసెంబర్ 2020 కంటే 25 శాతం పెరిగి USD 57.87 బిలియన్లకు చేరాయి. అలాగే అదేస‌మ‌యంలో  మొత్తం దిగుమతుల్లో 33.86 శాతం వృద్ధి చెంది USD 72.35 బిలియన్లకు చేరాయి. అలాగే.. 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం ఎగుమతులు 36 శాతం కంటే ఎక్కువ పెరిగి USD 479.07 బిలియన్లకు చేరాయి. ఇదే స‌మ‌యంలో మొత్తం దిగుమతులు 57.33 శాతం పెరిగి 547.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ప్రధానంగా ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్, కెమికల్స్ వంటి రంగాల సానుకూల వృద్ది కార‌ణంగా డిసెంబర్ 2021లో భార‌త దేశ ఎగుమతులు  38.91 శాతం పెరిగి USD 37.81 బిలియన్లకు చేరుకున్నాయి, అలాగే .. ఇదే స‌మ‌యంలో వాణిజ్య లోటు USD 21.68 బిలియన్లకు పెరిగిన‌ట్టు ప్రభుత్వ గణాంకాలు చూపించాయి.  అలాగే డిసెంబర్ 2021లో దిగుమతులు కూడా 38.55 శాతం పెరిగి 59.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

అలాగే. ఏప్రిల్-డిసెంబర్ 2021-22 కాలంలో భార‌త్ ఎగుమతులు 49.66 శాతం పెరిగి USD 301.38 బిలియన్లకు చేరుకున్నాయి. ఇదే స‌మ‌యంలో దిగుమతులు 68.91 శాతం పెరిగి USD 443.82 బిలియన్లకు చేరుకున్నాయి, ఇది USD 142.44 బిలియన్ల వాణిజ్య లోటు ఉన్న‌ట్టు భార‌త దేశ అధికారిక గణాంకాలు వెల్ల‌డిస్తోన్నాయి.  
 
డిసెంబరు 2021లో వాణిజ్య వస్తువుల ఎగుమతులు USD 37.81 బిలియన్లుగా న‌మోదయ్యింది. డిసెంబర్ 2020లో USD 27.22 బిలియన్లతో పోలిస్తే.. 38.91 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించాయి. డిసెంబర్ 2019తో పోలిస్తే.. డిసెంబర్ 2021లో ఎగుమతులు 39 శాతం సానుకూల వృద్ధిని ప్రదర్శించాయ‌ని  వాణిజ్య మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. 

  
 అలాగే డిసెంబర్ చివరి నాటికి భారత్‌లో వాణిజ్య లోటు 21.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. నవంబర్‌లో వాణిజ్య లోటు 22.91 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఏప్రిల్-డిసెంబర్‌లో ఎగుమతులు 49.6% పెరిగి $301.3 బిలియన్లకు చేరుకోగా, దిగుమతులు కూడా సమీక్షలో ఉన్న కాలానికి 68% పెరిగి $443.82 బిలియన్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2021లో నాన్-పెట్రోలియం మరియు నాన్-జెమ్స్, ఆభరణాల ఎగుమతులు 29.6% పెరిగి 28.92 బిలియన్లకు చేరాయి, అదే విభాగంలో దిగుమతులు 34% పెరిగి $35.4 బిలియన్లకు చేరుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios