బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు నవంబర్-3న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 7 స్థానాలకు, ఒడిషాలోని 2 స్థానాలకు, నాగాలాండ్ లోని 2 స్థానాలకు, కర్ణాటకలోని 2 స్థానాలకు, జార్ఖండ్ లోని 2 స్థానాలకు, తెలంగాణలోని 1 స్థానానికి, ఛత్తీస్‌ఘడ్ లోని 1 స్థానానికి, హర్యానాలోని 1 స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

ఇందుకు సంబంధించి దేశంలోని ప్రముఖ వార్తా ఛానెళ్లు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు గాను ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్లుగా తేలింది.

కాంగ్రెస్ పార్టీ సైతం హోరాహోరీగా పోరాడినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి 46 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం ఓట్లు పడొచ్చని సర్వే అంచనా వేసింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీదే పైచేయిగా తెలుస్తోంది.

ఇండియా టుడే సర్వే:

బీజేపీ : 5-6
సమాజ్‌వాదీ పార్టీ: 1-2
బీఎస్పీ: 1
కాంగ్రెస్: 0
ఇతరులు: 0