Asianet News TeluguAsianet News Telugu

madhya pradesh bypoll exit poll: ఇండియా టుడే సర్వే: బీజేపీకే మెజార్టీ స్థానాలు

మధ్యప్రదేశ్‌లో  28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో .. మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

india today exit poll on madhya pradesh bypoll ksp
Author
New Delhi, First Published Nov 7, 2020, 7:19 PM IST

మధ్యప్రదేశ్‌లో  28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో .. మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ బీజేపీ సీట్లు ఇచ్చింది. దీంతో  ఇప్పటి వరకు ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్న బీజేపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్‌ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని వీరు బీజేపీ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు.

ఆరు స్థానాలలో బీజేపీ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ టిక్కెట్‌ పైనో లేదా సమాజ్‌వాది పార్టీ టిక్కెట్‌ పైనో పోటీ చేశారు. మరికోందరు బీజేపీ నేతలు స్వతంత్రులుగా రంగంలో నిలిచారు.

దీనికి సంబంధించి వివిధ జాతీయ స్థాయి ఛానెళ్లు, ఏజెన్సీలు  సర్వేలు నిర్వహించాయి. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్లుగా తేలింది. కాంగ్రెస్ పార్టీ సైతం హోరాహోరీగా పోరాడినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి 46 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం ఓట్లు పడొచ్చని సర్వే అంచనా వేసింది. 

ఇండియా టుడే సర్వే:

బీజేపీ: 16-18 సీట్లు
కాంగ్రెస్: 10-12 సీట్లు
బీఎస్పీ: 1 

Follow Us:
Download App:
  • android
  • ios