భారత అంతరిక్ష సంస్థ నాసా ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించాలని నాసా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుండి అనుమతులు లభించలేదు. తాజాగా ఇవాళ కేంద్ర కేబినెట్ గగన్ యాన్ ప్రయోగానికయ్యే 10వేల కోట్ల  బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. దీంతో నాసా ఆ ప్రయోగ పనులను వేగవంతం చేయనుంది.

గగన్ యాన్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులతో పాటు బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2022 చేపట్టనున్న గగన్ యాన్ ప్రయోగానికి 10వేల కోట్లు ఖర్చవుతుందని నాసా  అంచనా వేస్తూ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ బడ్జెట్ కు ఆమోదిస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని రవిశంకర్ ప్రసాద్  వెల్లడించారు. 

గగన్ యాన్ ద్వారా ముగ్గురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్లు నాసా అధికారులు తెలిపారు. వీరు ఏడు రోజుల పాటు అంతరిక్షంలో వుండనున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే అంతరిక్షంలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే అంతరిక్షంలోకి మనుషులను పంపించాయి. గగన్ యాన్ భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమంగా చరిత్రలో నిలవనుంది.