Asianet News TeluguAsianet News Telugu

ఈ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షాపాతం: భారత వాతావరణ శాఖ

ఈ నెలలో సాధారణం కంటే అధిక వర్షాపాతం కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు నెలలో వర్షాలు ఆశించిన మేరకు పడలేదు. ఈ లోటును సెప్టెంబర్ వర్షాలు పూర్తి చేయనున్నట్టు ఐఎండీ తెలిపింది.

india to receive above normal rainfall during september forecasts IMD
Author
New Delhi, First Published Sep 1, 2021, 3:56 PM IST

న్యూఢిల్లీ: ఈ నెలలో వర్షాపాతం అంచనాలను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ వర్షాకాల చివరి మాసం సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధికంగా వర్షాపాతం ఉండనున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర బుధవారం వెల్లడించారు. సెప్టెంబర్ నెలకుగాను లాంగ్ రేంజ్ ఫోర్‌క్యాస్ట్ వివరాలను వెల్లడిస్తూ ఆయన ఈ వివరాలను పేర్కొన్నారు. లాంగ్ పీరియడ్ యావరేజ్ 110 శాతం ఉండనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌లో సగటున 170 ఎంఎం వర్షాపాతం నమోదవుతుందని చెప్పారు.

ఈ వర్షాపాతం గతనెల లోటును భర్తీ చేస్తుందని ఐఎండీ పేర్కొంది. ఒడిశా, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత నెలలో వర్షాపాతం ఆశించిన మేర పడలేదు. సెప్టెంబర్‌లో ఈ లోటు పూర్తవుతుందని తెలిపింది.

సెప్టెంబర్‌లో ఎల్‌నినో తటస్థంగానే ఉండనున్నట్టు మోహపాత్ర తెలిపారు. అయితే, బంగాళాఖాతంలో ఈ నెల 6న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వివరించారు. తద్వారా మధ్యభారతంలో వర్షాపాతం సమృద్ధిగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఆగస్టు నెలలో వర్షాలు తక్కువగా కురిశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios