Asianet News TeluguAsianet News Telugu

ఇక పాత ఛార్జర్ లకు గుడ్ బై... భారత్ లో మార్చి 2025 నుండి యూఎస్ బీ టైప్-సి ఛార్జింగ్‌ తప్పనిసరి..

ఇండియాలో 2025నాటికి తాము అందించే ఫోన్లలో తప్పనిసరిగా యూఎస్ బీ టైప్-సి ఛార్జింగ్‌ తప్పనిసరిగా ఉండాలని ఫోన్ల తయారీదారులకు ప్రభుత్వం ఆదేశించింది. 

India to Make must USB Type-C Standard in March 2025
Author
First Published Dec 29, 2022, 7:04 AM IST

భారతదేశంలోని మొబైల్ కంపెనీలు మార్చి 2025 నాటికి తమ ఉత్పత్తులలో ప్రామాణిక ఛార్జింగ్ పోర్ట్‌గా USB టైప్-సిని అందించాల్సి ఉంటుందని సివిల్ సర్వెంట్ మంగళవారం తెలిపారు. స్టేట్-రన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఛార్జింగ్ పోర్ట్ కోసం నాణ్యమైన బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మేరకు డివైస్ తయారీదారులు తమ ఉత్పత్తుల్లో వీటిని కూడా ఉంచాలని కోరుతున్నారు.

"బిఐఎస్ టైప్ సి ఛార్జర్‌ల ప్రమాణాలను తెలియజేసింది. మొబైల్స్.. వియరబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రభుత్వం రెండు రకాల సాధారణ ఛార్జింగ్ పోర్ట్‌లతో ముందుకు వస్తుంది" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు.

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు: జమ్మూకాశ్మీర్ భద్రతా పరిస్థితిపై అమిత్ షా హైలెవెల్ మీటింగ్..

ఈ మేరకు ప్రమాణాల గురించి పరిశ్రమ వాటాదారులతో సంప్రదించి, గ్లోబల్ సప్లై చెయిన్ పరిమితులు, ప్రమాణాలు, ఉత్పత్తుల లభ్యతను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం 2025 గడువును నిర్ణయించింది. యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్‌ల కోసం ఐరోపా సమాఖ్య కాలక్రమాన్ని ఈ గడువు అనుసరిస్తుంది.

ఎలక్ట్రానిక్ తయారీదారులు గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ సప్లై చెయిన్ కలిగి ఉన్నందున, 2024లో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌ల కోసం యూరోపియన్ యూనియన్ ప్రమాణాలను విడుదల చేసిన ఆరు నెలల తర్వాత యుఎస్‌బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించడం తప్పనిసరి చేయవచ్చని పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య విస్తృత ఏకాభిప్రాయం ఉంది’ అని రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు.

అంతకుముందు, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి పరిశ్రమల ప్రతినిధులు, విద్యా సంస్థలు, ఇతరులతో కూడిన సబ్-గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. గత నెలలో, సమర్థవంతమైన అమలు సులభంగా స్వీకరించడం కోసం యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్‌ను దశలవారీగా విడుదల చేయడానికి వాటాదారులు అంగీకరించారు. ఇ-వ్యర్థాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరాలలో యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్‌ల వల్ల ఈ వేస్ట్ పెరిగే అవకాశం ఉందా అనేదానిమీద సాధ్యమైన ప్రభావాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ అంచనా వేయవచ్చు లేదా పరిశీలించవచ్చు.

గ్లాస్గోలో 2026 యూఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన పర్యావరణ జీవనశైలి మిషన్‌ (LiFE ) దిశగా ఒక ముందడుగుగా యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్  ఉంటుంది. ఈ డివైస్ లు వాటి అటాచ్ మెంట్లను జాగ్రత్తగా.. తెలివిగా ఉపయోగించుకోవాలని..  LiFE పిలుపునిచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios