Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన భారత నావికుడు అభిలాష్ టామీ .. ప్రీమియర్ గ్లోబల్ రేస్‌ పూర్తి చేసిన తొలి భారతీయుడు ఇతడే..

Abhilash Tomy: రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

India sailor Abhilash Tomy creates history krj
Author
First Published Apr 29, 2023, 1:37 PM IST

Abhilash Tomy: రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించాడు.ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఘనత సాధించారు.  30,000 మైళ్ల రేసును పూర్తి చేశారు.  పక్షవాతం నుంచి కొలుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఘతన సాధించారు. 4 సెప్టెంబర్ 2022న ఫ్రాన్స్‌లోని లెస్ సాబుల్స్-డి'ఒలోన్ నుండి ప్రారంభమైన సోలో ఎరౌండ్-ది-వరల్డ్ సెయిలింగ్ రేస్‌లో మన భారతీయ సాహసికుడు, నావికుడు రెండవ స్థానంలో నిలిచారు.

అభిలాష్ టోమీ ప్రయాణిస్తున్న పడవ బయానాట్ 236 రోజుల పాటు ప్రయాణించి   శనివారం ఉదయం ముగింపు రేఖను దాటింది. 44 ఏళ్ల అభిలాష్ టామీ ప్రయాణం మహాసముద్రాల మీదుగా దాదాపు ఎనిమిది నెలలు సాగింది. టామీ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయుడు, ఆసియా వ్యక్తిగా అభిలాష్ టోమీ  రికార్డు క్రియేట్ చేశారు. ఈ రేసులో దక్షిణాఫ్రికాకు చెందిన 40 ఏళ్ల నావికుడు కిర్‌స్టెన్ న్యూషాఫర్‌ మొదటి స్థానంలో నిలిచారు. సముద్రంలో ఆకస్మిక వాతావరణ మార్పులు జరగడంతో కిర్‌స్టన్ చివరి 2-3 నాటికల్ మైళ్లను కవర్ చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పట్టింది. దీంతో అభిలాష్ టామీ తరువతి  స్థానంలో నిలిచాడు.

గోల్డెన్ గ్లోబ్ రేస్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీలలో ఒకటి. ఈ పోటీలో పాల్గొన్న 16 మంది మాత్రమే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి బోట్‌ రేసింగ్‌పై ఆసక్తి, సైన్యంలో ఉండటం వల్ల అభిలాష్ టామీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించారు. 26,000 నాటికల్ మైళ్లు పూర్తి చేసిన తర్వాత.. 16 మందిలో కేవలం 3 మంది మాత్రమే మిగిలారు. అభిలాష్ శనివారం రేసును ముగించాడు. దీనికి 236 రోజులు, 14 గంటలు, 46 నిమిషాల 34 సెకన్లు పట్టింది.

2018 గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో కూడా అభిలాష్ టోమీ పాల్గొన్నారు. అతని యాచ్ హిందూ మహాసముద్రంలోని తుఫానులో చిక్కుకుంది. ఈ క్రమంలో అతని పడవ విరిగిపోయింది. తీవ్రంగా గాయపడటంతో అతడు మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అతను సముద్రంలో మూడు రోజులపాటు చిక్కుకుపోగా విమానం సహాయంతో అతడిని రక్షించారు. ఆ సీజన్‌లో 18 మంది పాల్గొన్నారు. కానీ వారిలో ఐదుగురు మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios