Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తు: జనవరి 2 నుంచి మాక్‌డ్రిల్

దేశవ్యాప్తంగా జనవరి 2 నుంచి కరోనా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ జరగనుంది. ఇప్పటికే డ్రై రన్‌కు రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రంలోని హై లెవల్ కమిటీ సమాచారం అందించింది

India Runs Mock Drill Ahead Of Vaccine Use ksp
Author
New Delhi, First Published Dec 31, 2020, 2:15 PM IST

దేశవ్యాప్తంగా జనవరి 2 నుంచి కరోనా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ జరగనుంది. ఇప్పటికే డ్రై రన్‌కు రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రంలోని హై లెవల్ కమిటీ సమాచారం అందించింది. మాక్‌ డ్రిల్ తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. కాగా, కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 

టీకాకు వ్యతిరేకంగా సన్నాహాలు చివరిదశలో ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లోపి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు పునాదిరాయిని ఆయన గురువారం నాడు శంకుస్థాపన చేశారు.  

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు తమ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం డీజీసీఐకి ధరఖాస్తు చేసుకొన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ధరఖాస్తులను బుధవారం నాడు పరిగణనలోకి తీసుకొంది.

ఈ సందర్భంగా ఆయన  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్ సరఫరా చివరి దశలో ఉన్నాయన్నారు. భారత్ లో తయారైన వ్యాక్సిన్ ప్రజలకు లభిస్తోందని మోడీ చెప్పారు. దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉందన్నారు. వ్యాక్సిన్ పంపినీకి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తో కోవిడ్ అంతం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆయుష్మాన్ భారత్ యోజన కారణంగా రూ. 30 వేల కోట్లకు పైగా పేద ప్రజల డబ్బులు ఆదా అవుతోందన్నారు. గత ఆరేళ్లలో తాము 10 కొత్త ఎయిమ్స్ లను ప్రారంభించామన్నారు. 20 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios