న్యూఢిల్లీ: భారత్ లో కరోనా  డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  బుధవారం నాడు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజునే దేశంలో 2 లక్షల కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి.  అంతేకాదు కరోనాతో ఒక్క రోజులనే 1,038 మంది చనిపోయారు.  దేశంలలో కరోనా కేసుల సంఖ్య 1,40,,74,564కి చేరుకొంది.  కరోనాతో ఇప్పటివరకు దేశంలో 1,78, 123 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 14, 71, 877కి చేరింది.

దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు పడిపోయింది. ఫిబ్రవరిలో 97 శాతం ఉంటే ప్రస్తుతం  రికవరీ రేటు 88.92 శాతానికి పడిపోయింది.ప్రస్తుతం రోజుకు లక్ష కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో  అమెరికా, ఇండియా మాత్రమే ఉన్నాయి.  గతంలో అమెరికాలో ఒకే రోజులో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఒకే రోజు 2 లక్షల కేసులు నమోదు కావడం రికార్డుగా అధికారులు చెబుతున్నారు.