ప్రపంచాన్ని కలవరపెడుతోన్న మంకీపాక్స్ భారత్‌లోనూ ప్రవేశించింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న మంకీపాక్స్ భారత్‌లోనూ ప్రవేశించింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21న యూఏఈ నుంచి తిరువనంతపురానికి బాధితుడు చేరుకున్నట్లుగా తెలిపింది. యూఏఈలోని మంకీపాక్స్ సోకిన వ్యక్తితో బాధితుడు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. బాధితుడికి అధిక జ్వరం, శరీరంపై బొబ్బలు ఉన్నాయి. ఆ వ్యక్తి నుంచి నమూనా సేక‌రించి.. నిర్ధారణ కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఈ సమయంలో కరోనాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో చాలా తీవ్రమైన వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచంలోని 27 దేశాల్లో దాదాపు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఎండిమిక్ దశలో లేని ప్రాంతాల్లో వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. మే 29 నాటికి 257 కేసులు నమోదు కాగా, జూన్ 2 నాటికి.. ఆ సంఖ్య 780కి పెరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌క‌పోవ‌డం ఊర‌ట నిచ్చే అంశం. అయినా.. త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

#ALso Read:Monkeypox: మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

2018 లో యుకెలో మంకీపాక్స్ వైరస్ మొదటిసారి నివేదించబడింది. కొన్ని కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు బీబీసీ తెలిపింది. జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, వణుకు మరియు అలసట ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు. ఈ మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఈ వైరస్ (Virus)బారిన పడొచ్చు. వైరస్ యొక్క వాహకాలుగా ఉండే అవకాశం ఉన్న, ఇది సోకిన జంతువులను తాకడం ద్వారా లేదా వైరస్ తో కలుషితమైన పదార్థాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ వైరస్ కు చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ మశూచి వ్యాక్సినేషన్ (Smallpox Vaccination))ఈ వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతంగా ఉందని నిరూపించబడింది.