Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా: లక్షలోపు నమోదౌతున్న కోవిడ్ కేసులు

ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గు ముఖం పడుతున్నాయి. 10 రోజులకు పైగా లక్షలోపుగానే కరోనా కేసులు నమోదౌతున్నాయి.

India reports 67,208 new cases, 2,330 deaths in last 24 hrs lns
Author
New Delhi, First Published Jun 17, 2021, 9:43 AM IST

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గు ముఖం పడుతున్నాయి. 10 రోజులకు పైగా లక్షలోపుగానే కరోనా కేసులు నమోదౌతున్నాయి.గత 24 గంటల్లో కరోనా కేసులు 67,208 నమోదయ్యాయి.  ఒక్క రోజులో కరోనాతో 2,330 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసులు 2,97,00,313కి చేరుకొన్నాయి. దేశంలో ఇప్పటివరకు 38,52,38,220 మంది శాంపిల్స్ సేకరించారు. ఈ నెల 16న 19,31,249 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 67,208 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

ఇండియాలో కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2,84,91,670కి చేరింది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,81,903కి చేరుకొంది. దేశంలో ఇంకా  8,26,740 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 26,55,19,251 మంది వ్యాక్సినేషన్ వేయించుకొన్నారని కేంద్రం ప్రకటించింది.

దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నుండి అన్‌లాక్ దిశగా వెళ్తున్నాయి. ఢిల్లీలో లాక్‌డౌన్ మంచి ఫలితాలు ఇచ్చింది. ఢిల్లీలో కరోనా కేసులు బాగా తగ్గాయి.  ఇతర రాష్ట్రాల్లో కూడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios