న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 46,790 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 75.97 లక్షలకు చేరుకొంది. గత 24 గంటల్లో కరోనాతో 587 మంది మరణించారు.

కరోనాతో  దేశంలో ఇప్పటివరకు 1,15, 197 మంది మరణించారు.  ఈ నెల 19వ తేదీ వరకు 9,61,16, 771 మంది శాంపిల్స్ సేకరించారు. అక్టోబర్ 19వ తేదీన 10,32,795 మంది శాంపిల్స్ ను పరీక్షించారు.

ఈ ఏడాది జూలై  నెల తర్వాత ఒక్క రోజులో 50 వేలకు తక్కువ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 75,97,063కి చేరుకొంది.గత 24 గంటల్లో కరోనాతో అత్యధికంగా 587 మంది మరణించారు.

ఈ ఏడాది జూలై 23వ తేదీన భారత్ లో 45,720 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో రోజుకు 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మాసంలో సగటున రోజూ 50 నుండి 60 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలోని కేరళ,ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.