దేశంలో కరోనా కేసులు తగ్గినా, మరణాలు కొంత ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,071 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటితో పోలిస్తే 2 శాతం తక్కువగా కరోనా కేసులు తగ్గాయి. మరణాలు గతంలో కంటే పెరిగాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గినా, మరణాలు కొంత ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,071 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటితో పోలిస్తే 2 శాతం తక్కువగా కరోనా కేసులు తగ్గాయి. మరణాలు గతంలో కంటే పెరిగాయి.శనివారం నాడు 18,38,490 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.వీరిలో 43,071కి కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం నాడు కరోనాతో 955 మంది మరణించారు. కానీ శనివారం నాడు ఒక్క రోజే కరోనాతో 955కి పెరిగింది.

దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,02, 005కి చేరింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుండి 2,96,58,078కి చేరుకొంది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 52, 299 మంది కోలుకొన్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,85, 350కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.59 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.