Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ఒక్క రోజులోనే 40 శాతం పెరుగుదల: రికవరీ కంటే కరోనా కొత్త కేసులే ఎక్కువ

ఇండియాలో కరోనా కేసులు 40 శాతం పెరిగాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే  40 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.

India reports 42,015 new Covid-19 cases, 3,998 deaths in last 24 hours lns
Author
New Delhi, First Published Jul 21, 2021, 10:34 AM IST


న్యూఢిల్లీ:ఇండియాలో కరోనా కేసులు అంతకుముందు  రోజుతో పోలిస్తే పెరిగాయి. అయితే కేసుల సంఖ్య 40 శాతం పెరిగినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.మంగళవారం నాడు దేశంలోని 18,52,140 మందిని పరీక్షిస్తే  42,015 మందికి కరోనా సోకినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య తెలిపింది. అంతకుముందు రోజు దేశంలో 30 వేల కరోనా కేసులు  నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 3,998 మంది కరోనాతో మరణించారు. 

దేశంలో కరోనా కేసులు 3.12 కోట్లకు చేరుకొన్నాయి. కరోనాతో  ఇప్పటివరకు ఇండియాలో 4.18 లక్షల మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇంకా 4,07,170 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 36,977 మంది కోలుకొన్నారు. దేశంలో యాక్టివ్ కేసుల  రేటు 1.30 శాతంగా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 97.36 శాతానికి చేరుకొంది. నిన్న ఒక్క రోజే 34,25,446 మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు.  ఇప్పటివరకు దేశంలో 41,54,72,455 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios