ఇండియాలో గత 24 గంటల్లో కరోనా కేసులు 41,965 గా నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు రికార్డు అవుతున్నాయి. కేరళ రాష్ట్రంలో 30,203 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో మొత్తం కరోనా కేసులు 3,28,10,845కి చేరింది.
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 41,965 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 460 మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 30,203 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసులు 3,28,10,845కి చేరింది.
గత 24 గంటల్లో 33,964 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో దేశంలో దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 3,19,93,644కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,78,10,181కి చేరింది.దేశ వ్యాప్తంగా కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 4,39,020కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,33,18,718 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటివరకు దేశంలో 65,41,13,508 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు.దేశంలో కరోనా రికవరీ రేటు 97.51 శాతంగా నమోదైంది. కరోనా యాక్టివ్ కేసులు 1.15 శాతంగా రికార్డైంది.
