ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 41,195 కొత్త కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.నిన్న ఒక్క రోజే కరోనాతో 490 మంది మరణించారు.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకొంది.గత 24 గంటల్లో 41,195 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 38,353 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్న ఒక్క రోజే కరోనాతో 490 మంది మరణించారు.
ఈ నెల 11వ తేదీ వరకు దేశంలోని 48,73,70,196 మంది శాంపిల్స్ సేకరించారు. నిన్న ఒక్క రోజే 21,24,953 మంది నుండి శాంపిల్స్ సేకరించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3,12,60,050 మంది కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న రోగుల సంఖ్య 97.45 శాతంగా నమోదైంది.
కరోనా యాక్టివ్ కేసులు 1.21 శాతంగా రికార్డయ్యాయి. ఈ ఏడాది మార్చి తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 3,87,987గా నమోదైంది.
దేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదైతున్నాయి. కేరళలో కోవిడ్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడ పలు సూచనలు చేసింది.
