దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు సంఖ్య 4,30,88,118కి చేరింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజు నమోదైన కేసులుతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 25 శాతం ఎక్కువ. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు సంఖ్య 4,30,88,118కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 31 మంది మరణించారు.. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,920కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,509గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.76 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,802 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,25,44,689కి చేరకుంది. మరోవైపు మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. ఇక, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు189 కోట్ల 48 లక్షల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇక, ప్రపంచాన్ని వణికిస్తోన్న covid-19 ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ కొత్త రూపాన్ని సంతరించుకుంటూ.. వేరియంట్లతో వేధిస్తోంది. తాజాగా Omicron XE మొదటి కేసు భారత్ లో వెలుగు చూసినట్లు INSACOG ప్రకటించింది. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ మొదటి కేసును గుర్తించినట్లు తాజాగా ఇన్సాకాగ్ ధ్రువీకరించింది. అత్యంత ఎక్కువగా సంక్రమించే శక్తి ఉందని భావిస్తున్నఈ వేరియంట్ ఇదివరకే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగు చూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఖచ్చితమైన నిర్ధారణ లేదు. తాజాగా వైరస్ జన్యుసంక్రమణాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ప్రభుత్వ కన్సార్షియం (ఇన్సా కాగ్) దీనిపై స్పష్టత ఇచ్చింది.
‘BA .2.10, BA .2.12, BA .2 ఉప రకాలుగా గుర్తించాం. BA .2 పాత సీక్వెన్స్ లే కొత్త వాటిగా వర్గీకరణకు గురయ్యాయి. ఇవి వైరస్ తీవ్రత పెంచుతాయి అనేదానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. గతవారంతో పోల్చితే 12 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 19 రాష్ట్రాల్లో తగ్గుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో ఎక్స్ఈ క్లస్టర్లు ఏర్పడిన దాఖలాలు లేకపోవడం పోరాటం ఇచ్చే అంశం’ అంటూ ఇన్సా కాగ్ తాజాగా వెల్లడించింది.
