న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కరోనా కేసులతో పాటు  కరోనాతో మరణించిన రోగుల సంఖ్య తగ్గడంతో వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఊపిరిపీల్చుకొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడంతో కరోనా కేసుల సఃంఖ్య తగ్గుతుందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. 

గత 24 గంటల్లో ఇండియాలో  2,40,842  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 26,528,846కి చేరుకొంది. గత 24 గంటల్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2741 గా నమోదైంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య  2,99,296కి చేరుకొంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు  55,27,092  కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో 23,67,742, కేరళలో 22,93,632, తమిళనాడులో 17,70,888, ఉత్తర్‌ప్రదేశ్ లో 16,59,265,ఆంధ్రప్రదేశ్ లో 15,42,079 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రెండు వారాల క్రితం కరోనా కేసుల సంఖ్య  4 లక్షల నుండి మూడు లక్షల లోపునకు పడిపోయింది. కరోనాతో మరణాల సంఖ్య 4 వేల నుండి మూడు వేలకు తగ్గింది.