దేశంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరుకుంది. 

దేశంలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,28,690 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం డేటాను విడుదల చేసింది. మరోవైపు తాజాగా 42 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 5,25,428కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.

ఇక, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,68,533కి చేరింది. దేశంలో రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగ.. యాక్టివ్ కేసులు 0.30 శాతంగా ఉంది. దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతం కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారత్​లో శనివారం 10,21,164 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 198.76 కోట్లకు చేరింది. 

ఇక, భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్క్‌ను దాటింది. ఇక, 2020 సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్లు, ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది.