ఇండియాలో కరోనా కేసుల సంఖ్య  తగ్గుతోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తోందని వైద్యశాఖాధికారులు తెలిపారు. 

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తోందని వైద్యశాఖాధికారులు తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో 2,67,334 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 2,54,96330కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 4,529 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,83,248కి చేరుకొంది. కరోనాతో మరణించిన రోగుల శాతం 1.11కి చేరుకొంది.


దేశంలో 12.66 శాతంతో యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసులు32,26,719కి చేరుకొన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 86.23కి పెరిగింది. కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 2,19,86,363కి చేరుకొంది. గత ఏడాది ఆగష్టు 7న దేశంలో 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు చేరుకొన్నాయి. అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 29న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి కేసులు దాటాయి. ఈ ఏడాది మే 4న రెండు కోట్లను దాటాయి.10 వారాల తర్వాత ముంబైలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి పడిపోయింది. ముంబైలో పాజిటివీ రేటు 5.31 శాతంగా నమోదైంది. రికవరీ రేటు కూడ 93 శాతంగా రికార్డైంది.