వరుసగా ఆరో రోజు మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు: గత నెలతో పోలిస్తే రికార్డు మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా ఆరో రోజూ కూడ కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. 

India records 319,435 cases, lockdown in Karnataka lns


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా ఆరో రోజూ కూడ కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో దేశంలో 3.2 లక్షల కేసులు రికార్డయ్యాయి. కరోనాతో సుమారు 2 ,766వేల మంది మరణించారు.గత 24 గంటల వ్యవధిలో కరోనాతో దేశంలో 271 మంది మరణించారు. కరోనా నుండి కోలుకొని 2,51,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో  ఇప్పవరకు 1,76,36,307 కేసులు రికార్డయ్యాయి.  ఈ మాసంలో ఇప్పటికే 34,595 మంది చనిపోయారు. గత వారం రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య 17,333కి చేరుకొన్నాయి.

2020 సెప్టెంబర్ మాసంలో నమోదైన మరణాలతో పోలిస్తే ఈ మాసంలో అత్యధికంగా మరణాలు చోటు చేసుకొన్నాయి.  గత ఏడాదిలో 33,230 కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మార్చి మాసంలో 5,656 మంది మరణించారు. ఏప్రిల్ మాసానికి వచ్చేసరికి  మరణాల రేటు ఆరు రేట్లు పెరిగింది. గత ఏడాది ఆగష్టు మాసంలో 28,954 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి మాసంలో 33,230 కేసులు రికార్డయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios