న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగు రోజూ కూడ కరోనా కేసులు మూడున్నర లక్షలకు చేరుకొన్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,,49,391 కేసులు నమోదయ్యాయి.  అంతేకాదు ఒక్క రోజులోనే  2,767 మంది కరోనాతో మరణించారు.

దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,92,311కి చేరుకొంది.   మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో 54 శాతం కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,17,113 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలో 1,40,85,110 మంది కరోనా నుండి కోలుకొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ శాతం 83.49కి పడిపోయింది. 

 దేశంలో కరోనా మరణాల రేటు 1.14 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.  ప్రస్తుతం 26,82,751కి చేరుకొన్నాయి.  నిన్న ఒక్కరోజే దేశంలో 25,36,612 మందికి వ్యాక్సిన్ అందించారు. టీకాలు పొందినవారి సంఖ్య దేశంలో 14,09,16,417కి చేరింది.కరోనా కేసుల ఉధృతిని అరికట్టేందుకు మే 1వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని  కేంద్రం నిర్ణయం తీసుకొంది. మూడో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది కేంద్రం.