ఇండియాలో కరోనా జోరు: 24 గంటల్లో 3876 మంది మృతి
గత 24 గంటల్లో 3,29,942 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో కరోనా కేసులు 2,26,62,575కి చేరుకొన్నాయి. కరోనాతో గత 24 గంటల్లో 3,876 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 2,49,992 చేరుకొంది.
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 3,29,942 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో కరోనా కేసులు 2,26,62,575కి చేరుకొన్నాయి. కరోనాతో గత 24 గంటల్లో 3,876 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 2,49,992 చేరుకొంది.దేశంలో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 1,90,27,305కి చేరుకొంది.దేశంలో 18,50,110 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా 3,29,942 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇక దేశంలో కరోనా రికవరీ కేసుల సంఖ్య కూడ భారీగానే పెరుగుతోంది. కరోనా కేసులతో పాటు రికవరీ సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఊపిరిపీల్చుకొంటున్నారు.
గత 24 గంటల్లో మరో 3,56,082 మంది వైరస్ బారి నుండి బయటపడ్డారు. దేశంలో కరోనా రికవరీ రేటు 82.89 శాతానికి చేరుకొంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు 30 వేలు తగ్గాయి. లాక్‌డౌన్ కారణంగా దక్షిణ భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 17.27 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. సోమవారం నాడు 25,03,756 మంది టీకా తీసుకొన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.