Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

రెండు రోజులుగా ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  మూడు రోజుల క్రితం రెండు లక్షలకు దిగుమన నమోదైన కేసులు రెండు రోజులుగా  స్వల్పంగా పెరుగుతున్నాయి. 

India records 211,298 cases; 3,847 deaths in last 24 hrs lns
Author
New Delhi, First Published May 27, 2021, 10:35 AM IST

న్యూఢిల్లీ: రెండు రోజులుగా ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  మూడు రోజుల క్రితం రెండు లక్షలకు దిగుమన నమోదైన కేసులు రెండు రోజులుగా  స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో  2,11,299  కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 21,57,857 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 2,11,299 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సుమారు 40 రోజుల తర్వాత  మే 24వ తర్వాత రోజువారీ కేసులు 1,96,427 నమోదయ్యాయి.  అయితే  గత రెండు రోజులుగా కరోనా కేసులు రెండు లక్షలపైనే నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.లాక్‌డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.

ఢిల్లీలో కూడ కరోనా  కేసులు తగుతున్నాయి. గత 24 గంటల్లో  దేశంలోని తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 33,764 రికార్డయ్యాయి. తమిళనాడు తర్వాతి స్థానంలో కేరళ నిలిచింది. మహరాష్ట్రలో 24,752 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో 26,811, ఏపీలో 18,286 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల వ్యవధిలో దేశంలో 3,847 మంది కరోనాతో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,15,235కి చేరుకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios